By: ABP Desam | Updated at : 14 Dec 2021 12:45 PM (IST)
'సుడిగాలి' సుధీర్ - రష్మీ గౌతమ్... ఇమ్మాన్యుయేల్-వర్ష
బుల్లితెరపై 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్‌ది హిట్ జోడీ! ఇటు కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్', అటు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో వాళ్లిద్దరి పెయిర్ క్లిక్ అయ్యింది. అఫ్ కోర్స్... ఇప్పుడు కొత్తగా మొదలైన 'ఢీ 14' సీజన్‌లో వాళ్లిద్దరూ లేరనుకోండి. అయినా సరే... వాళ్ల జోడీకి అభిమానులు మాత్రం ఉన్నారు. అయితే... ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ వచ్చాక సుధీర్ - రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా? ఓ స్కిట్‌లో 'సుడిగాలి' సుధీర్ క్లోజ్ ఫ్రెండ్, అతని టీమ్ మెంబర్ అయిన 'గెటప్' శ్రీను వేసిన డైలాగ్ బట్టి తగ్గిందని అనుకోవాలి.
డిసెంబర్ 17న టెలికాస్ట్ కానున్న 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' ప్రోమో చూశారా? అందులో రష్మీ గౌతమ్, 'గెటప్' శ్రీను ఓ స్పెషల్ స్కిట్ చేశారు. ఇద్దరూ ఏజెంట్స్ గెటప్ వేసి... కొంత మంది జబర్దస్త్ కమెడియన్లను స్టేజి మీద నిలబెట్టి క్వశ్చన్ చేశారు. 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి క్వశ్చన్ చేసినట్టు! ఇంతకు ముందు ఇటువంటి స్కిట్ ఒకటి చేశారు. అయితే... లేటెస్ట్ స్కిట్ లో రష్మీ గౌతమ్ ఏజెంట్ గెటప్ వేయడం విశేషం. స్కిట్ మధ్యలో ఇమ్మాన్యుయేల్, వర్షను 'మీరు ముంతాజ్, షాజహాన్ ఆ?' అని రష్మీ ప్రశ్నించారు. 'మేం ముంతాజ్, షాజహాన్ అయితే మీరెవరు? లైలా మజ్నునా?' అని ఇమ్మాన్యుయేల్ ఎదురు ప్రశ్నించాడు.
అంతకు ముందు లవ్ సింబల్స్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి సుధీర్, రష్మీ కారణం అని, వాళ్లను బండబూతులు తిట్టొచ్చని నాటీ నరేష్ కామెంట్ చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే... 'ఏరా! రేటింగ్ పెంచకుండా కెమిస్ట్రీ పెంచుతున్నావ్ అంట?' అని రాకేష్‌ను 'గెటప్' శ్రీను అడుగుతాడు. స్కిట్‌లో జోడీలను పెట్టి అలా రేటింగ్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నా' అని రాకేష్ అన్నాడు. అందుకు బదులుగా 'జోడీలతో అవ్వట్లేదురా ఈ మధ్యన. కొన్ని జోడీలు వచ్చిన తర్వాత కొన్ని జోడీలు కనుమరుగు అయిపోయాయి' అని 'గెటప్' శ్రీను అన్నాడు. కనుమరుగు అయిపోయానని అన్నప్పుడు రష్మీ వైపు చూపించాడు. అంతకు ముందు కొన్ని జోడీలు వచ్చినప్పుడు అని చెప్పిన సమయంలో ఇమ్మాన్యుయేల్, వర్షను చూపించాడు. దీని అర్థం ఏమిటి? సుధీర్, రష్మీ జోడీ కనుమరుగు అయిపోయిందనా? ఇదే డౌట్ కొడుతోంది కొంతమంది ప్రేక్షకులకు! అసలే, 'ఢీ' కొత్త సీజన్‌లో వాళ్లిద్దరూ కనిపించని సమయంలో ఇటువంటి పంచ్ డైలాగ్ పడటం విశేషం.
Extra Jabardasth Latest Promo:
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!
Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి
IND vs ENG 5th Test: ఇంగ్లండ్పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్కు బండి సంజయ్ సవాల్