News
News
X

Prabhas's Radhe Shyam: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది 

'రాధే శ్యామ్' నుంచి మరో సాంగ్ టీజర్ వచ్చింది. 'సంచారి' అంటూ సాగే ఈ టీజర్ ఎలా ఉందో చూడండి.

FOLLOW US: 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా రూపొందిన సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మిస్తున్నారు. సినిమాలో రెండు సాంగ్స్‌(ఈ రాతలే..., నగుమోము తారలే)ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ 'సంచారి' టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఎలా ఉందో చూడండి.

దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా...  హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. 'చలో... చలో... సంచారి! చల్ చలో... చలో!  చలో... చలో... సంచారి! చల్ చలో... చలో... కొత్త నేలపై' అంటూ పాటను కృష్ణకాంత్ (కెకె) రాశారు. సినిమాలో హీరో ట్రావెలింగ్ చేసే సమయంలో వచ్చే పాటలా ఉంది ఇది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ప్రేమ కథా చిత్రమిది. 'బాహుబలి' రెండు భాగాలు, 'సాహో', అంతకు ముందు సినిమాల్లో ప్రేమ ఉన్నప్పటికీ... అందులో యాక్షన్ ఎక్కువ. అందువల్ల, ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Sanchari Song Teaser -  Radhe Shyam Movie:

Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 14 Dec 2021 01:03 PM (IST) Tags: Prabhas Pooja hegde Radhe Shyam Sanchari Song Teaser రాధే శ్యామ్ Radhe Shyam Song Teaser Prabhas New Song

సంబంధిత కథనాలు

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Prabhas: 'కార్తికేయ2' సినిమాపై ప్రభాస్ రియాక్షన్ - పోస్ట్ వైరల్!

Prabhas: 'కార్తికేయ2' సినిమాపై ప్రభాస్ రియాక్షన్ - పోస్ట్ వైరల్!

Jacqueline Extortion Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్, రూ.200 కోట్ల కేసులో నిందితురాలంటూ షార్జ్‌షీట్!

Jacqueline Extortion Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్, రూ.200 కోట్ల కేసులో నిందితురాలంటూ షార్జ్‌షీట్!

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

1770 Movie : రాజమౌళి శిష్యుడి పాన్ ఇండియా సినిమా - 'వందేమాతరం' సృష్టికర్త బంకించంద్ర 'ఆనంద్ మఠ్' స్ఫూర్తితో

1770 Movie : రాజమౌళి శిష్యుడి పాన్ ఇండియా సినిమా - 'వందేమాతరం' సృష్టికర్త బంకించంద్ర 'ఆనంద్ మఠ్' స్ఫూర్తితో

టాప్ స్టోరీస్

BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

BJP :  పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ -  గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్