Ankita Lokhande Marriage: బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన నటి.. ఫొటోలు వైరల్..
సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహమాడింది.
బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే చాలా కాలంగా విక్కీ జైన్ అనే వ్యక్తిని డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వీరి వివాహం జరిగింది. పెళ్లిలో అంకిత లోఖండే.. గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, విక్కీజైన్.. వైట్ అండ్ గోల్డ్ కలర్ షేర్వానీ ధరించాడు.
కరోనా నిబంధనల కారణంగా అతి తక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ 14న అంకిత-విక్కీ వివాహం జరిగింది. కొద్దిరోజులుగా ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూనే ఉన్నారు. అంకిత పెళ్లి విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకి విషెస్ చెబుతున్నారు.
2005లో ఇండోర్ నుంచి ముంబైకి వచ్చిన అంకిత లోఖండే.. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా 'పవిత్ర రిష్టా' అనే టీవీ సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అదే సీరియల్ తో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ తో చాలా కాలం డేటింగ్ చేసింది అంకిత. దాదాపు ఆరేళ్లపాటు అతడితో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ తరువాత విడిపోయింది. సుశాంత్ మరణించినప్పుడు అంకిత అతడి ఫ్యామిలీని పలకరించడానికి వారింటికి కూడా వెళ్లింది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.
View this post on Instagram
View this post on Instagram
Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..
Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి