Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?
నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి రణబీర్ కపూర్, అలియాభట్ అతిథులుగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరి ఉన్నారు. వీరిలో సన్నీ విజేతగా నిలుస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎవరు విన్ అవుతారనే విషయాన్ని పక్కన పెడితే.. గ్రాండ్ ఫినాలేను మాత్రం భారీగా ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీమ్. ముందుగా అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ లాంటి స్టార్ లను గెస్ట్ లుగా తీసుకురావాలనుకున్నారు.
కానీ ఇప్పుడు నాగార్జున బాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున హోస్ట్ చేస్తోన్న ఈ షో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి రణబీర్ కపూర్, అలియాభట్ అతిథులుగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ జంట నటిస్తోన్న బడా చిత్రం 'బ్రహ్మాస్త్ర' విడుదలకు సిద్ధంగా ఉంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో పాటు అమితాబ్ బచ్చన్, అలియాభట్, డింపుల్ కపాడియా లాంటి తారలు నటించారు.
అంతేకాదు.. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషించారు. ఇందులో ఆయన పురావస్తు నిపుణుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్, అలియా హైదరాబాద్ వస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ వేదికపైకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. నాగార్జున కీలకపాత్ర పోషించిన ఈ సినిమాను సౌత్ లో కూడా ప్రమోట్ చేయాలనే ఆలోచన టీమ్ కి ఉంది.
అందుకే తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి రాబోతున్నారు. మొత్తానికి ఒక టాలీవుడ్ షోలో రణబీర్, అలియా లాంటి స్టార్స్ కనిపించడమంటే విశేషమనే చెప్పాలి. కచ్చితంగా ఫినాలే ఇదొక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో దీపికా పదుకోన్ కూడా ఈ స్టేజ్ పై కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఎవరెవరిని గెస్ట్ లుగా తీసుకొస్తున్నారో చూడాలి!
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి