Varalaxmi Sarathkumar: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
సమంత ప్రధాన పాత్రలో 'యశోద' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఏంటంటే?
![Varalaxmi Sarathkumar: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే? Varalakshmi Sarath Kumar is doing key role in Samantha's 'Yashoda'! What is her role? Varalaxmi Sarathkumar: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/beb93604667dd44181383ca3b4282bc1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇప్పుడు సమంత నేషనల్ స్టార్. ఆమెకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టు దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత ఆమె స్టార్ట్ చేసిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె మధుబాల పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఈ రోజు (బుధవారం, డిసెంబర్ 15న) వరలక్ష్మీ శరత్ కుమార్ 'యశోద' చిత్రీకరణ ప్రారంభించారు.
తెలుగు సహా దక్షిణాది భాషలు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో 'యశోద' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో హరి, హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఈ నెల 23 వరకూ ఇక్కడే షూటింగ్ చేయనున్నారు. దాంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. జనవరిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత ప్రధాన తారగా మా సంస్థలో నిర్మిస్తున్న సినిమా 'యశోద'. ఇందులో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. ఈ నెల 6న సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతోంది. ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మార్చికి షూటింగ్ అంతా పూర్తి చేస్తాం. థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది" అని చెప్పారు. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తుండగా... పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాత.
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: బాలయ్యతో లెజెండరీ దర్శకుడు రాజమౌళి... త్వరలో ప్రోమో విడుదల
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)