అన్వేషించండి
Advertisement
Balakrishna: దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !
దేవుడున్నాడని..ఆయనే చూసుకుంటాడని టిక్కెట్ల వివాదంపై నందమూరి బాలకృష్ణ గుంటూరులో వ్యాఖ్యానించారు. యాధృచ్చికంగా సీఎం జగన్ కూడా తరచూ దేవుడున్నాడనే అంటూ ఉంటారు. అందుకే బాలకృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దేవుడున్నాడని... దేవుడు ఆశీర్వదిస్తాడని ఏపీ సీఎం జగన్ దాదాపుగా ప్రతి సందర్భంలోనూ అంటూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ కూడా సేమ్ డైలాగ్ చెప్పారు. టిక్కెట్ వివాదంలో స్పందిస్తూ.. దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. నట సింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ' సినిమా ఈ నెల 2వ తేదీన విడుదల అయ్యింది. రెండు వారాల తర్వాత కూడా థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మాండంగా వస్తున్నారు. సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. 'అఖండ' విడుదల అయినప్పుడు ఏపీలో జీవో 35 అమలులో ఉంది. తక్కువ టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ సినిమాను విడుదల చేశారు. మంగళవారం జీవో 35ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా విడుదల అయినప్పుడు ఎక్కువ టికెట్ రేట్స్ ఉంటే వసూళ్లు ఇంకా ఎక్కువ వచ్చేవని ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఆ సంగతి పక్కన పెడితే... 'అఖండ' సినిమా అఖండమైన విజయం సాధించడంతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ రోజు (బుధవారం, డిసెంబర్ 15) ఉదయం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. టికెట్ రేట్స్ అంశమై బాలకృష్ణ స్పందించారు.
"ఏపీలోని టిక్కెట్ రేట్స్ గురించి మేం గతంలో చర్చించుకున్నాం. ఏది అయితే అది అయ్యిందని మా సినిమాను విడుదల చేశాం. ధైర్యంగా ముందడుగు వేశాం. కొంత మంది వెనకడుగు వేసినా... మేం వేయలేదు. గతంలో సినిమా టిక్కెట్ రేట్స్ వ్యవహారంపై మాట్లాడాను. అన్నిటికీ న్యాయనిర్ణేత ఆ దేవుడు ఉన్నారు. జీవో 35ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందని అంటున్నారు. చూద్దాం... ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో? అప్పీల్‌కు వెళితే... ఆ తర్వాత పరిస్థితులను బట్టి స్పందిస్తా" అని బాలకృష్ణ చెప్పారు. 'అఖండ' విజయంతో చిత్ర పరిశ్రమలో మిగతావారికి ధైర్యం వచ్చిందని, సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు.
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
ఆనాడు నందమూరి తారక రామారావు గారు భక్తిని కాపాడారని, ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమాగా 'అఖండ' నిలిచిందని బాలకృష్ణ అన్నారు. ప్రేక్షకులు సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకు వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'అఖండ'ను ధియేటర్లలో మాత్రమే చూడాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కోరారు. సినిమాను గెలిపించిన ప్రతి ఒక్కరికీ దర్శకుడు బోయపాటి శ్రీను ధన్యవాదాలు తెలిపారు.
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
Also Read: అఫీషియల్... దర్శకుడిగా మరో అభిమానికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్
Also Read: ఎవడాడు? దిగొచ్చాడా?... రానాకు 'భీమ్లా నాయక్' టీమ్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
Also Read: అఫీషియల్... దర్శకుడిగా మరో అభిమానికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్
Also Read: ఎవడాడు? దిగొచ్చాడా?... రానాకు 'భీమ్లా నాయక్' టీమ్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement