Prakash Raj: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్

ప్రకాష్ రాజ్‌ చేసిన సాయం ఓ పేదయువతి జీవితంలో వెలుగులు నింపింది.

FOLLOW US: 

మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే.  కరోనా సమయంలో పెద్దమనసు చాటుకున్న ప్రకాష్ రాజ్ మళ్లీ మరోసారి తన మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితంలో వెలుగులు నింపారు. యూకేలో ఉన్నత చదువులు పూర్తిచేసేందుకు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. సినిమా దర్శకుడైన నవీన్ మహ్మదాలీ ట్వీట్ తో ఈ విషయం బయటకు తెలిసింది. 

శ్రీ చందన అనే అమ్మాయి చదువుల సరస్వతి. ఆమెకు బ్రిటన్లో మాస్టర్స్ చదివే అవకాశం వచ్చింది. అదే సమయంలో తండ్రి మరణించారు. దీంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టి యూకే యూనివర్సిటీవారి సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్‌కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి ఆమె చదువుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీచందన ఇటీవలే యూకేలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె చదువుకైన ఖర్చునంతా ఆయనే భరించారు. ఇప్పుడు బ్రిటన్లో ఉద్యోగం పొందడానికి కూడా డబ్బు అవసరం పడింది శ్రీచందనకి. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు ప్రకాష్. ఆమె ఉద్యోగానికి కూడా కట్టాల్సిన మొత్తాన్ని ఆమెకు అందించారు. ఈ విషయాన్ని నవీన్ మహ్మదాలీ ట్విట్టర్లో పోస్టు చేశారు. పేద యువతి జీవితంలో వెలుగులు నింపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

నవీన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ స్పందించారు.  ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. అనేక చేతులు కలిసినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి... ద జోయ్ ఆఫ్ ఎంపవరింగ్’ అంటూ ట్వీట్ చేశారు. 

Also Read: బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన నటి.. ఫొటోలు వైరల్..

Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..

Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 09:30 AM (IST) Tags: Prakash raj ప్రకాష్ రాజ్ Prakash Raj helped poor girl Study in UK

సంబంధిత కథనాలు

Sammathame Telugu Movie OTT Release: ఆహాలో 'సమ్మతమే' - కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? 

Sammathame Telugu Movie OTT Release: ఆహాలో 'సమ్మతమే' - కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? 

Dil Raju Blessed With Baby Boy: మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి

Dil Raju Blessed With Baby Boy: మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి

Suriya Invited To Oscars Committee: సూర్యకు అరుదైన గౌరవం - ఆస్కార్స్‌లో తొలి తమిళ నటుడిగా రికార్డ్

Suriya Invited To Oscars Committee: సూర్యకు అరుదైన గౌరవం - ఆస్కార్స్‌లో తొలి తమిళ నటుడిగా రికార్డ్

Vikram Movie Telugu OTT Release: ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్' వచ్చేది ఆ రోజే - ఇట్స్ అఫీషియల్

Vikram Movie Telugu OTT Release: ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్' వచ్చేది ఆ రోజే - ఇట్స్ అఫీషియల్

Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర

Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్  శ్రావణ భార్గవి, హేమచంద్ర

టాప్ స్టోరీస్

TS Inter Results: ఆ విద్యార్థులను చూస్తే గుండె తరుక్కుపోతోంది, అలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి

TS Inter Results: ఆ విద్యార్థులను చూస్తే గుండె తరుక్కుపోతోంది, అలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి

Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

Hyderabad Flexies: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రగడ! ‘సాలు దొర, సంపకు దొర’ అంటూ పోటాపోటీగా ఏర్పాట్లు

Hyderabad Flexies: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రగడ! ‘సాలు దొర, సంపకు దొర’ అంటూ పోటాపోటీగా ఏర్పాట్లు

No Responce On ABV : ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు !

No Responce On ABV :   ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు !