Samantha Special Song: మాకు లేవా మనోభావాలు.. సమంత స్పెషల్ సాంగ్ పై పురుషుల సంఘం కేసు
‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేసేస్తుంది. ఇలా అప్ లోడ్ చేశారో లేదో.. అలా మిలియన్ వ్యూస్ లోకి వెళ్లిపోయింది. అయితే దీనిపై తాజాగా కేసు పెట్టింది పురుషుల సంఘం.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. పుష్ప సినిమా ట్రెండే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లోని సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతకుమించి అందులోని పాటలు తెగ ఊపేస్తున్నాయి. ఈ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటి వరకూ.. హిరోయిన్ గా చేసిన సమంత.. తొలిసారి.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అప్ లోడ్ చేసిన కొద్ది సమయానికే.. యూట్యూబ్ ను షేక్ చేసేసింది ఈ పాట. ఎక్కడ చూసినా.. ఇదే సాంగ్.
పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక వైపైతే.. గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇటీవలె విడుదలైన ఈ పాట ఇప్పటికే మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. అయితే ఇందులోని లిరిక్స్ తో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై పురుషుల సంఘం కేసు పెట్టింది.
'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ వచ్చిన లిరిక్స్ పై.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మగవాళ్లపై తప్పుడు అభిప్రాయం వచ్చేలా.. పాట ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప టీంతో పాటు పాటలో నటించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసుపెట్టింది. పాటపై నిషేధం విధించాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పాటపై ఇప్పటికే ఊహాగానాలు.. హై రేంజ్ లో ఉన్నాయి. థియేటర్స్‌లో వేరే లెవల్‌లో ఉంటుందని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం చెప్పారు. అంతేగాకుండా.. సమంత స్పెషల్ సాంగ్ లో మెుదటి సారి కనిపిస్తుండటంతో కూడా.. అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా డిసెంబర్17న విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: Pushpa: రూల్స్ కి వ్యతిరేకంగా 'పుష్ప' ఈవెంట్.. పోలీసులు ఫైర్..
Also Read: Pushpa: పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?
Also Read: Harnaaz Sandhu: విశ్వ సుందరి హర్నాజ్ ముద్దు పేరేంటో తెలుసా? ఆ పేరు పెట్టింది అతడేనట...
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల