By: ABP Desam | Updated at : 17 Dec 2021 03:19 PM (IST)
పుష్ఫ థియేటర్‌పై రాళ్ల దాడి
Pushpa Theaters Attack: టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప మూవీ విడుదలైంది. బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా విడుదల కావడంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అందులోనూ బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో భారీగా విడుదల చేశారు. ఓ వైపు బన్నీ మాస్ యాక్షన్ సీన్లకు మంచి రెస్సాన్స్ వస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన తొలి మూవీ, అందులోనూ డీ గ్లామరైజ్‌డ్ రోల్స్ పోషించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే నేడు పుష్ప పార్ట్ 1 విడుదల కావడంతో ఫ్యాన్స్ భారీగా థియేటర్లకు వెళ్తున్నారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. బన్నీ ఫ్యాన్స్ పుష్ప థియేటర్లపై దాడులకు దిగారు. థియేటర్ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
తిరుపతిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేవారు. పుష్ప సినిమా చూస్తుండగా సౌండ్ సరిగ్గా రావడం లేదని, సౌండ్ సిస్టమ్ బాగోలేదంటూ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. పళని సినీ ప్యాలెస్ లో రాళ్లతో దాడి చేయగా ప్రొజెక్టర్ ధ్వంసమైంది. థియేటర్ అద్దాలు సైతం పగిలిపోయాయి. తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్ అరుపులు, కేకలతో థియేటర్ ఒక్కసారిగా దద్దరిల్లింది.
థియేటర్లపై ‘అనంత’ ఆగ్రహం..
అనంతపురంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సినిమా చూసేందుకు ఎంతో ఆశగా థియేటర్‌కు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బెనిఫిట్ షో కోసం బన్నీ అభిమానులు టికెట్ డబ్బులు చెల్లించారు. మరికాసేపట్లో పుష్ప సినిమా చూస్తామని భావించిన ఫ్యాన్స్‌కు థియేటర్ యాజమాన్యం షాకిచ్చింది. చివరి నిమిషంలో బెనిఫిట్ షో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆగ్రహావేశానికి లోనైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ హిందూపురంలోని బాలాజీ థియేటర్‌పై దాడులకు పాల్పడ్డారు. తమ అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో చూడలేకపోయామంటూ థియేటర్‌పై రాళ్లు విసిరి రచ్చ రచ్చ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బన్నీ అభిమానులను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Also Read: Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!
అనంతపురంలోని హిందూపురంలో గల బాలాజీ థియేటర్ బెనిఫిట్ షో వేస్తామని చెప్పి వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. తమ అభిమాన హీరో సినిమా తొలిరోజు తొలి షో చూడలేకపోయినందుకు థియేటర్ మీద రాళ్లు విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు అభిమానులను చెదరగొట్టి థియేటర్ గేట్లు మూసేసి పరిస్థితులను అదుపు చేశారు.
Also Read: Pushpa Movie Review - 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్‌కు వచ్చేది అందుకే!
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్
TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక
దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!
IRCTC Recruitment: ఐఆర్సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!