అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu March 10th Episode: మనోజ్ ని బెల్టుతో బాదిన మీనా, భయపడి దాక్కున్న ప్రభావతి, పుట్టింటికి వెళ్లిపోయిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు మార్చి 10 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu March 10th Episode: మీనా బంధువులు భోజనం చేస్తుంటే అవమానించి పంపిస్తుంది ప్రభావతి. నోటికొచ్చినట్టు మాట్లాడిన మనోజ్ ని బెల్టుతో ఉతుకుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu 2025 March 10th Episode Telugu Serial

బాలుని జైలు నుంచి విడిపించుకుని తీసుకొస్తుంది మీనా. ఇప్పటివరకూ ఊరిమీద తిరిగివచ్చావ్ అంటూ మాట్లాడుతుంది. నీ పుట్టింటివాళ్లకు నాటకాలు ఆడడం అలవాటే కదా అని కించపరుస్తుంది. ఇంతలో మనోజ్ వచ్చి కాఫీ కూడా ఇచ్చే దిక్కులేదంటాడు. ఏంటి..నీభార్య లేదా , దిక్కులేదా అని క్లాస్ వేస్తాడు బాలు. ఎప్పటిలా తిడుతుంటే..నా పుట్టింటివాళ్లను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా ఇస్తుంది. సైలెంట్ అయిపోతుంది ప్రభావతి.

నాకు జ్వరంగా ఉంది నేను లీవ్ పెట్టాను..నువ్వు కూడా లీవ్ పెట్టు అంటుంది శ్రుతి. కుదరదు అంటాడు రవి. ఫైర్ అవుతుంది శ్రుతి. ఇంతలో నీతూ కాల్ చేసి ఈ రోజు కార్పొరేట్ ఆర్డర్ ఉంది కదా అని గుర్తుచేస్తుంది. మీది జాయింట్ ఫ్యామిలీ అన్నావ్ కదా..ఇంట్లో ఎవరినైనా తీసుకెళ్లమను నువ్వు రావడం మానేయవద్దు అని ఆర్డర్ వేస్తుంది. నీకు ఫీవర్ వస్తేమాత్రం నేను డబ్బింగ్ స్టూడియోకు వెళ్లను అంటుంది. శ్రుతి ఎంత చెప్పినా కానీ రవి వినకుండా ఆఫీస్ కి వెళ్లిపోతాడు.

బ్యాగ్ సర్దుకుని వస్తుంది శ్రుతి..నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను అంటుంది. నాకు ఆరోగ్యం బాలేకపోతే నాకు తోడుగా ఉండకుండా వెళ్లిపోయాడు అంటుంది శ్రుతి. పాపం రవికి ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అని సర్దిచెప్పేందుకు ట్రై చేస్తుంది మీనా. నాకన్నా ముఖ్యమైన పనులు ఏమున్నాయ్..వాడికి నాపై ప్రేమే లేదు అంటుంది. నీ తలకు దెబ్బ తగిలినప్పుడు బాలు నీతోనే ఉన్నాడు..మీ ఇద్దరికీ ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది..కానీ మీ అన్యోన్యత చూసి మచ్చటగా అనిపిస్తుంది. కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ చూడు ఎలా ఉన్నాడో అంటుంది. ప్రభావతి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కానీ పట్టించుకోదు. సూట్ కేస్ తీసుకుని బయటకు వెళ్లిపోతుంది..బాలు చూసి డబ్బుడమ్మ ఏంటి డబ్బా పట్టుకుని వెళుతోందంటూ మీనాను పిలుస్తాడు. ఏం జరిగిందని అడిగితే..చెబుతుంది మీనా. శ్రుతి ఇంటికెళ్లిన గంటలో రవి తీసుకొచ్చేస్తాడులే అంటాడు బాలు

అక్కడ రెస్టారెంట్ లో రవి వర్క్ లో ఉంటాడు. ఏంటి డల్ గా ఉన్నావ్ అని నీతూ అడిగితే..ఇంటి దగ్గర సమస్య అంటాడు. సమస్యను ఇంట్లోనే వదిలేసి రావాలి కదా..నీ పరిస్థితి అర్థం చేసుకోలను కానీ వర్క్ కూడా ఇంపార్టెంట్ ...నిన్ను నమ్మి ఈ వర్క్ తీసుకున్నా అంటుంది. ఇంతలో ప్రభావతి కాల్ చేసి శ్రుతి గొడవపడి ఇట్లోంచి వెళ్లిపోయిందని చెబుతుంది. నేనంటే భయం లేదు, పద్ధతి లేదు అంటూ చెబుతుంది. నన్ను లీవ్ పెట్టమంది అందుకే కోపం వచ్చిందని చెబుతాడు రవి. ఇదేమైనా సినిమానా ...ఇంత చిన్న విషయానికే ఇంట్లోంచి వెళ్లిపోతారా అంటుంది. అత్తయ్య రవిని రెచ్చగొడుతోందని అంటుంది మీనా. మీ నాన్న నాకేమైనా తోడుగా ఉన్నాడా ఏంటి? బాలుగాడు కడుపులో ఉన్నప్పుడు తంతూనే ఉన్నాడు ..అప్పుడు తోడుగా ఉన్నారేంటి అంటూ రెచ్చగొడుతుంది. నువ్వు బాధపడకు, ఒక్కసారి లొంగావంటే జీవితాంతం ఆడిస్తూనే ఉంటుంది అంటుంది. వస్తూ వస్తూ ఇంటికెళ్లి తీసుకొస్తాను అంటుంది ప్రభావతి. అలా చేస్తే దద్దమ్మవు అవుతాయ్..నోర్మూసుకుని ఇంటికిరా అంటుంది. 

మా అమ్మ కలపాలి కానీ విడదీయాలని చేస్తోందేంటని బాలు అంటాడు. నిన్ను తిట్టినట్టు ఆమెను తిడితే ఊరుకోదు కాబట్టి ఇలా చేస్తోంది అంటాడు. అత్తయ్య మాటలు విని రవి శ్రుతిని తీసుకురాకపోతే వాళ్ల కాపురం ఏమువుతుంది అంటుంది. వెంటనే రవికి కాల్ చేస్తుంది. అత్తయ్య మాటలు విన్నాను..ఈ టైమ్ లో కలపాలని చూడాలి కానీ దూరం పెంచేలా చూస్తున్నారు.. శ్రుతి చిన్న పిల్ల అందుకే కోపం వచ్చింది అంటుంది మీనా. ఎలా వెళ్లినా శ్రుతి పుట్టింటికే వెళ్లింది..ఇదే అవకాశం అనుకుని శ్రుతిని అక్కడే ఉంచేస్తారు. ఇక్కడ గొడవ అత్తయ్య పెద్దది చేసినట్టు, అక్కడ కూడా వాళ్లమ్మ ఏవేవో చెబితే ఏం జరుగుతుందో ఆలోచించు.. పనయ్యాక శ్రుతి దగ్గరకు వెళ్లి నచ్చచెప్పి తీసుకురా అంటుంది మీనా. మీ అన్నయ్య నాకు ఆరోగ్యం బాలేకపోతే ట్రిప్పు కూడా వదులుకుని నాతోనే ఉంటారు..ఏ భార్య అయినా కోరుకునేది ఇదే అంటుంది. థ్యాంక్స్ వదినా , ఇప్పుడు హాయిగా ఉందంటూ కాల్ కట్ చేస్తాడు. ఈ పూలగంప మనసులో ఎన్ని సువాసనలు ఉన్నాయో అని బాలు మెచ్చుకుంటాడు.

మీనా బంధువులు వచ్చి శుభలేక ఇస్తారు.. మావయ్య పేరు మీద రాయండి అంటుంది మీనా. బాలుకి కాల్ చేసి రమ్మని అడుగుతుంది. పెళ్లికి వస్తామని చెప్పు, నాకు ఇప్పుడు రావడం కుదరదు అంటాడు బాలు. వాళ్లకు భోజనం పెట్టి పంపించు అంటాడు. ఆయన లేటవుతుందన్నారు పెళ్లికి వస్తామని చెప్పమన్నారు అంటుంది. అందరకీ భోజనం పెడుతుంటుంది..ఇంతలో ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. మా పిన్ని బాబాయ్, అత్తయ్య మావయ్య అని పరిచయం చేస్తుంది. ఇలా రా పని ఉంది అని రూమ్ లోకి పిలుస్తుంది ప్రభావతి. ఎవర్ని పెడితే వాళ్లని ఇంటికి పిలిచి భోజనం పెడతావా అంటూ మాట్లాడుతుంది. నీ పుట్టింట్లో పెట్టు తీసుకెళ్లి అంటుంది. మీనా ఎంత చెబుతున్నా వినదు ప్రభావతి. కింద భోజనం చేస్తున్నవాళ్లంతా చేయి కడుక్కుని వెళ్లిపోతారు. ఈ మిగిలిన భోజనం..మీ వీధిలో కుక్కలకు పెట్టు మొరగడం ఆపేస్తాయ్..ఇక్కడ నువ్వు బావున్నావ్ అనుకున్నా అనేసి వెళ్లిపోతారు. 

నా ఉప్పు తిని నన్నే అనేసి పోతున్నారు అంటుంది ప్రభావతి. వచ్చి చూడండి ఏం తిన్నారో..ఒక్క ముద్దైనా తినకముందే అరవడం మొదలుపెట్టారు ..నా పుట్టిల్లు చిన్నదే కానీ వచ్చిన వాళ్లకు భోజనం పెట్టకుండా పంపించం అంటుంది. నా ఇల్లు దోచిపెడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది. ఓ పూట భోజనం పెడితే నా ఇల్లు దోచి పెడుతున్నావా అంటే..ఇల్లే మింగాలని చూసిన మీరు అలా మాట్లాడకండి అని క్లాస్ వేసి వెళ్లిపోతుంది


మీనా పూలు కడుతూ ఏదో ఆలోచనలో ఉంటుంది. ఇంట్లో తను పడే బాధ చెప్పుకుంటుంది మీనా. మీ అత్తే కదా కారణం అంటారంతా. వచ్చిన వళ్లు అన్నం దగ్గర్నుంచి లేచివెళ్లిపోయారు అంటుంది మీనా. ఎవరికి వారే అత్తతో పడిన బాధలు, వాటి నుంచి బయటపడిన సంగతులు చెబుతారు. అత్తకు బుద్ధిచెప్పకపోతే తగ్గరు అని చెప్తారు. 

హాల్లో కూర్చున్న ప్రభావతి దగ్గరకు తుమ్ముకుంటూ వస్తాడు మనోజ్. ఏమైందని అని అడిగితే.. జలుబు చేసింది, వేడి చేసింది అంటూ చెప్తాడు. ట్యాబ్లెట్లు కాదు చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుంది అంటుంది ప్రభావతి. ఏయ్ ఆగవే..అంటుంది. ఏం కొంప మునిగిందని అడుగుతుంది మీనా. ఎక్కడికి వెళ్లావ్ అని అడిగితే తిక్కతిక్కగా సమాధానం చెబుతుంది మీనా. వెటకారమా అంటాడు మనోజ్. ఈయనకు బతకడం తెలియదు కానీ వెటకారం తెలుసే అంటుంది. బజారుకెళ్లి చికెన్ తీసుకొచ్చి సూప్ చేయి మనోజ్ కోసం అంటుంది. చేయను అంటుంది మీనా. రోహిణికి కాల్ చేసి పిలిచి చేయమని చెప్పండి అంటుంది. తను గొప్పింటి అమ్మాయ్ అంటుంది ప్రభావతి. మీ కొడుక్కి అత్తారిల్లే తెలియదు, వాళ్ల మావే వెళ్లి అత్తారింట్లో కూచ్చున్నాడు అని సెటైర్ వేస్తుంది. నీ చుట్టాలకైతే వండిపెడతావ్..నా కొడుక్కి పెట్టవా అంటుంది. ఆఫ్టరాల్ పూలమ్మకునేదానివి అంటూ నోరు పారేసుకుంటాడు మనోజ్.. లోపలకు వెళ్లి బెల్ట్ తీసుకొస్తుంది మీనా. బాలు గాడికి ఉన్న పొగరుంది అంటాడు. తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ మనోజ్ ని బెల్టుతో బాదుతుంది మీనా.. భయపడి దాక్కుంటుంది ప్రభావతి.

 

 

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today April 13th: నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
Meghasandesam Serial Today April 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
Podharillu Serial Today April 13th: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
Brahmamudi Serial Today April 13th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను అనుమానించిన రేఖ – సుభాష్‌ను చంపేయబోయిన భూషణ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను అనుమానించిన రేఖ – సుభాష్‌ను చంపేయబోయిన భూషణ్‌
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Embed widget