అన్వేషించండి
Salman Khan: అలాంటి సినిమాలు మనమెందుకు తీయలేం - బాలీవుడ్ ఇండస్ట్రీపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
పాన్ ఇండియా సినిమాల గురించి, సౌత్ ఇండస్ట్రీ గొప్పదనం గురించి మాట్లాడారు సల్మాన్.

బాలీవుడ్ ఇండస్ట్రీపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ IIFA 2022 ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. నిన్న జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల గురించి, సౌత్ ఇండస్ట్రీ గొప్పదనం గురించి మాట్లాడారు సల్మాన్. ముందుగా మెగాస్టార్ నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. చిరుతో కలిసి వర్క్ చేయడం మంచి అనుభూతిని కలిగించిందని అన్నారు. చాలా ఏళ్లుగా చిరుతో మంచి రిలేషన్ ఉందని చెప్పారు.
అలానే ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అద్భుతంగా నటించాడని.. అతడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. కానీ బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఎందుకు సరిగ్గా ఆడడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు సల్మాన్. బాలీవుడ్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు రావాలని.. సౌత్ లో ఆ తరహా సినిమాలను రూపొందిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారని చెప్పారు.
బాలీవుడ్ లో కూడా అటువంటి సినిమాలను తీయాలని సూచించారు. ఒకప్పుడు తను నటించిన 'దబాంగ్' సినిమాను సౌత్ లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారని.. ఇకపై కూడా సౌత్ ఫిలిం మేకర్స్ రీమేక్ చేసే కథలు బాలీవుడ్ లో రావాలని చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'టైగర్ 3' సినిమాలో నటిస్తున్నారు. అలానే షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్' సినిమాలో క్యామియో రోల్ లో కనిపించనున్నారు సల్మాన్ ఖాన్.
View this post on Instagram
Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?
ఇంకా చదవండి





















