Rashmika Mandanna : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
Virosh Couple : తన భార్య రష్మికకు గద్దర్ అవార్డు రావడంపై విజయ్ దేవరకొండ స్పందించారు. ఎంతో గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక విజ్జూ... అంటూ క్యూట్ రిప్లై ఇచ్చారు.

Rashmika Mandanna Reaction Vijay Deverakonda Appreciation On Gaddar Award : తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా అనౌన్స్ చేసిన గద్దర్ అవార్డ్స్‌లో 2025వ సంవత్సరానికి ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరిగిన కొన్ని రోజులకే ఈ గుడ్ న్యూస్ విన్నారు.
దీనిపై విజయ్ రియాక్ట్ అవుతూ... రష్మికకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 'హ్యాపీ అండ్ ప్రౌడ్' అంటూ లవ్ సింబల్‌తో ఇన్ స్టా పోస్ట్ చేశారు. ఇది చూసిన నేషనల్ క్రష్ క్యూట్‌గా రిప్లై ఇచ్చారు. 'విజ్జూ నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుత ఇవి వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఒకరినొకరు అభినందించుకున్నారని... ఇవే బెస్ట్ విషెష్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : 'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
పెళ్లి తర్వాత...
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వివాహ రిసెప్షన్, హడావిడిలో బిజీగా మారారు. ఇప్పుడు ఫ్రీ కావడంతో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 12 నుంచి ఆయన 'రణబాలి' షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్, రష్మిక ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
గతంలో వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మంచి సక్సెస్ అందుకున్నాయి. మూవీలో రణబాలిగా విజయ్, జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. రీసెంట్‌గా మూవీలో దంపతులుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా... 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తుండగా... రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ వారియర్‌గా కనిపించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు























