Samanyudu Trailer: 'సింహాన్ని ఎవరూ చంపలేరు..' విశాల్ యాక్షన్ ట్రీట్..
విశాల్ హీరోగా నటించిన 'సామాన్యుడు' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
![Samanyudu Trailer: 'సింహాన్ని ఎవరూ చంపలేరు..' విశాల్ యాక్షన్ ట్రీట్.. Vishal's Samanyudu Trailer Out Samanyudu Trailer: 'సింహాన్ని ఎవరూ చంపలేరు..' విశాల్ యాక్షన్ ట్రీట్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/62e3bb327ea4cfe88a416563e76c31ed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విశాల్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'సామాన్యుడు'. తు.ప.శరవణన్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. 'ఒక ఇంట్లో రెండు శవాలు ఉన్నాయి. ఒక శవానికి ప్రాణముంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసిందన్నారు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారేలేక హత్య చేసేవాడికి, మిగితావాళ్లను చంపి తను బ్రతకాలనుకునేవాడికి చాలా తేడా ఉంది' అంటూ విశాల్ చెప్పే డైలాగ్ ను బట్టి ఇదొక క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అలానే రొమాంటిక్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అతడి పాత్ర సింహంలా ఉండబోతుందని ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.
ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది.యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి, రవీనా రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. విశాల్ నటిస్తున్న 31వ సినిమా ఇది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ హైదరాబాద్ లోనే నిర్వహించారు.
Here’s the trailer of #VeeramaeVaagaiSoodum & #Saamanyudu. GB
— Vishal (@VishalKOfficial) January 19, 2022
🔗Tamil: https://t.co/o3dIAqPtPD
🔗 Telugu: https://t.co/kLoz7WncX2#VeeramaeVaagaiSoodumTrailer #SaamanyuduTrailer #VVSTrailer pic.twitter.com/dhURU3Dt5S
Also Read: 2000 వేల నోట్ల కట్టతో మెగాహీరో హడావిడి..
Also Read: ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ఎంట్రీ.. వెల్కమ్ చెప్పిన రవితేజ..
Also Read: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?
Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?
Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)