By: ABP Desam | Updated at : 19 Jan 2022 01:27 PM (IST)
సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్..
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సిరి.. తొలివారంలోనే కెప్టెన్ అయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. కానీ షణ్ముఖ్ తో స్నేహం ఆమెపై నెగెటివిటీను తీసుకొచ్చింది. హౌస్ లో అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది సిరి. నిజానికి సిరికి ఇదివరకే శ్రీహాన్ అనే టీవీ ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ అయింది.
అతడు కూడా బిగ్ బాస్ సీజన్ 5 స్టేజ్ పై కనిపించాడు. తన మాటలతో అందరినీ నవ్వించాడు. ప్రియాంక సింగ్ ను అతడు ఇమిటేట్ చేసిన తీరు హౌస్ మేట్స్ ని ఆకట్టుకుంది. పది నిమిషాల పాటు స్టేజ్ పై ఉన్న అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు శ్రీహాన్ కి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చిందని సమాచారం.
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికోసం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతమందిని షార్ట్ లిస్ట్ కూడా చేశారు. వారిలో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఉన్నట్లు సమాచారం. ఈ ఛాన్స్ గనుక వినియోగించుకోగలిగితే శ్రీహాన్ కి మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయం.
ఇక డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. టీవీల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది. కానీ ఓటీటీ వెర్షన్ మాత్రం పది వారాల వరకే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?
Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం