అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Gopal Varma: మెగా కుటుంబంలో వర్మ చిచ్చు.. మెగా ఫ్యాన్స్ Vs అల్లు ఫ్యాన్స్
మెగాఫ్యామిలీను టార్గెట్ చేస్తూ.. ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
![Ram Gopal Varma: మెగా కుటుంబంలో వర్మ చిచ్చు.. మెగా ఫ్యాన్స్ Vs అల్లు ఫ్యాన్స్ Ram Gopal Varma Comments on Mega family and Allu Arjun Family Ram Gopal Varma: మెగా కుటుంబంలో వర్మ చిచ్చు.. మెగా ఫ్యాన్స్ Vs అల్లు ఫ్యాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/18/f8aedbcc38005eccd777c415bfbc8eb6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగా కుటుంబంలో వర్మ చిచ్చు..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మెగాఫ్యామిలీను టార్గెట్ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'కష్టమే కానీ కాదనలేని నిజం ఏంటంటే.. అల్లు ఈజ్ ది న్యూ మెగా' అని ట్వీట్ పెట్టారు వర్మ. ఫ్యూచర్ మొత్తం అల్లు ఫ్యామిలీదే అన్నట్లుగా ఆయన పెట్టిన ఈ ట్వీట్ దుమారం రేపుతోంది.
మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూనే.. ఎప్పుడూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ ను మెగాస్టార్ తో పోల్చారు. ఫ్యూచర్ లో మెగా ఫ్యామిలీను అల్లు అర్జున్ బంధువులుగా ఇండియా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వివాదానికి తెరలేపారు వర్మ. మెగా కుటుంబానికి నేరుగా రక్త సంబంధం లేనప్పటికీ.. మెగా కాంపౌండ్ లో అల్లు అర్జున్ ఒక్కడే మెగాస్టార్ అని వర్మ పేర్కొన్నారు.
ఫ్యూచర్ లో అల్లు అర్జున్ ఓ మెగాస్టార్ అవుతాడని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో ఎవరినీ పోల్చలేమంటూ రీసెంట్ గా ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. నిన్న రాత్రి ఈ ట్వీట్స్ వేసిన వర్మ ఉదయానికి అన్నింటినీ డిలీట్ చేసేశారు. మరోపక్క ఆన్ లైన్ వేదికలపై మెగా, అల్లు ఫ్యాన్స్ విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. దీంతో మీమర్స్ కి కంటెంట్ దొరికినట్లయింది. ఈ ఇష్యూపై రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో వర్మ తీరు వివాదాస్పదమవుతోంది. సినీ, రాజకీయ అంశాలపై ఆయన జోరుగా స్పందిస్తున్నారు. ఏపీ టికెట్ రేట్ ఇష్యూపై ఆయన వేసిన ట్వీట్స్ పై రాజకీయనాయకులు మండిపడ్డారు. ఇప్పుడు టికెట్ రేట్ ఇష్యూని పక్కన పెట్టి మరోసారి మెగాఫ్యామిలీపై పడ్డారు వర్మ.
The hard but indisputable fact is ALLU is the new MEGA
— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!
Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)