Anushka: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..
కరోనా కారణంగా అనుష్క షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క చివరిగా 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ఒకట్రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ.. ఇప్పటివరకు షూటింగ్ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు దర్శకుడు మహేష్ పి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సివుంది. కానీ అనుష్క మాత్రం డేట్స్ ఇవ్వడం లేదట.
ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతుండడంతో సెలబ్రిటీలంతా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు మాత్రం ధైర్యంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ అనుష్క మాత్రం రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఆరోగ్యం విషయంలో ఈ బ్యూటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని.. ఆమె దర్శకనిర్మాతలకు చెప్పేసిందట.
అనుష్క కారణంగానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోతున్నారట. ఒక్కసారి పరిస్థితులు నార్మల్ అయితే అప్పుడు ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ కూడా అనుష్కను గట్టిగా అడగలేకపోతుంది. కాబట్టి కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చేవరకు అనుష్క షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. అందుకే నవీన్ పోలిశెట్టి కూడా ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..
Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి