Devi Sri Prasad: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..
ఎట్టకేలకు 'పుష్ప' ఐటెం సాంగ్ పై వస్తోన్న విమర్శలపై స్పందించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.
ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన ఐటెం సాంగ్స్ లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా..?' సాంగ్ ముందుంటుంది. ఇండియా వైడ్ గా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కి.. సమంత మాస్ స్టెప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది ఈ పాట. అలానే ఈ ఐటెం సాంగ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మగవాళ్ల మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉందంటూ కొంతమంది విమర్శలు చేశారు.
భక్తిపాట సాహిత్యాన్ని ఇలా ఐటెం సాంగ్ కింద మార్చేశారంటూ ఓ రాజకీయనాయకుడు విమర్శలు చేశారు. ఎట్టకేలకు ఈ విమర్శలపై స్పందించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. మగాళ్లను అసభ్యంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని చెప్పిన దేవిశ్రీ.. ఈ ఐటెం సాంగ్ తో సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చామని అంటున్నారు.
చంద్రబోస్, సుకుమార్ కలిసి ఈ సాహిత్యంతో తన దగ్గరకొచ్చినప్పుడే.. ఇలాంటి విమర్శలు వస్తాయని ఊహించామని.. కానీ నిజాయితీగా పనిచేశామని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని.. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను చెప్పాలనుకున్నామని.. అంతే తప్ప మగాళ్లను జనరలైజ్ చేసి చెప్పడం తమ ఉద్దేశం కాదని అన్నారు.
అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటల్లో మహిళలను అసభ్యంగా చూపించారని, మహిళలను కించేపరిచేలా సాహిత్యం ఉందని.. అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు దేవిశ్రీప్రసాద్. ఇక 'పుష్ప' ఐటెం సాంగ్ ను పొగుడుతూ.. చాలా మంది లేడీస్ ఫ్రెండ్స్, మహిళ జర్నలిస్ట్ ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు దేవిశ్రీ.
Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..