అన్వేషించండి
Advertisement
NTR30: ఎన్టీఆర్ తో అలియా రొమాన్స్.. కొరటాల ఏం ఫిక్స్ అయ్యారో..?
NTR30 లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ హీరోయిన్ అంటూ ఫిక్సయిపోయారు నెటిజన్లు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా 2018లో విడుదలైంది. ఆ తరువాత ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 'ఆర్ఆర్ఆర్'తో బిజీ అయిపోయారు ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే అన్నేళ్లు పడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. 2020లో 'ఆర్ఆర్ఆర్' వస్తుందని అనుకున్నారు. కానీ వాయిదా పడింది.
2022 జనవరిలో సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని అన్నారు. కానీ లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయంలో ఆలస్యం జరుగుతుంది. ముందు అనుకున్న ప్రకారమైతే.. ఈపాటికి కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలవ్వాలి. కానీ ఇటు 'ఆర్ఆర్ఆర్', అటు 'ఆచార్య' ఆలస్యం కావడంతో వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి టైం పడుతోంది.
ఈలోపు ఎన్టీఆర్ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారు కొరటాల. ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా రెడీ అయిపోయిందని సమాచారం. ఇదొక రివెంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ ని కన్ఫర్మ్ చేశారని.. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయని అంటున్నారు. ఇంకా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదట.
కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ హీరోయిన్ అంటూ ఫిక్సయిపోయారు నెటిజన్లు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్, అలియాభట్ కాంబినేషన్ క్యూట్ గా ఉంటుందంటూ దర్శకుడు కొరటాలకి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. మరి ఈ విషయంలో కొరటాల ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..
Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion