అన్వేషించండి

Acharya: 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్.. అనౌన్స్మెంట్ వచ్చేసింది..

కనుమ పండగ సందర్భంగా 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు చెప్పిన టైంకి రావడం లేదని సంక్రాంతి రోజు అఫీషియల్ గా వెల్లడించారు. 

దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' ఇలా క్రేజీ ప్రాజెక్ట్ లన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు 'ఆచార్య'ను కూడా పోస్ట్ పోన్ చేయడం మెగాభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొంది. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలియ‌జేసింది.
 
తాజాగా కనుమ పండగ సందర్భంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. ఉగాది కానుకగా ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఏప్రిల్ 1న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల కావాల్సింది కానీ ఆ సినిమా ఆగస్టుకి వెళ్లిందని సమాచారం. అందుకే ఆ డేట్ న మెగాస్టార్ రావడానికి రెడీ అవుతున్నారు. 
 
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

 
 
 
 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
Action Thriller OTT : కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
Jagamae Sangeetham Series OTT : మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కొడుకుని పనివాడిని చేసేసిన పద్మాక్షి! ఆ బంటీనే అంబిక కొడుకు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కొడుకుని పనివాడిని చేసేసిన పద్మాక్షి! ఆ బంటీనే అంబిక కొడుకు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget