X

Swathi Muthyam Glimpse: నువ్ వర్జిన్ ఆ? అమ్మాయి అలా అడిగేసరికి... 'స్వాతిముత్యం' గ్లింప్స్ చూశారా?

'స్వాతి ముత్యం' సినిమా గ్లింప్స్ విడుద‌ల అయ్యింది. చూశారా?

FOLLOW US: 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గ‌ణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ... సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'స్వాతిముత్యం'. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను సంక్రాంతి సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు.
'స్వాతిముత్యం'లో బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం వంటివి గ్లింప్స్‌లో చూపించారు. 'ఏరా... అమ్మాయిని కలిశావా? పంతులుగారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ల నాన్నకి కొంచెం పట్టింపులు ఎక్కువ. పద్దతి... అదీ ఇదీ అని బుర్ర తినేస్తాడు ఏంటి?' అని రావు రమేష్ చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్‌ స్టార్ట్ అయ్యింది. ఆ డైలాగ్ వినిపిస్తున్న సమయంలో బెల్లంకొండ గణేష్, వర్షను చూపించారు. 'నువ్ వర్జిన్ ఆ?' అని హీరోను హీరోయిన్ అడగటం... సెల్ఫీ తీసుకునేటప్పుడు తల్లికి హీరోయిన్ ముద్దు పెట్టిందని అదే విధంగా తన తండ్రితో సెల్ఫీ తీసుకోవాలని హీరో అనుకోవడం... మామగారి కాళ్లు పెళ్లికొడుకు కడగటం... గ్లింప్స్‌ ఆసక్తికరంగా ఉంది.  

జీవితం, ప్రేమ, పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాటి మధ్య ఓ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది చిత్ర కథాంశం. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. సీనియర్ నటుడు నరేష్ వీకే, రావు రమేష్, సుబ్బరాజు, 'వెన్నెల' కిషోర్, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, సమర్పణ: పీడీవీ ప్రసాద్.

Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Suryadevara Naga Vamsi Varsha Bollamma Bellamkonda Ganesh SwathiMuthyam SwathiMuthyam Movie SwathiMuthyam First Glimpse

సంబంధిత కథనాలు

Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..

Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..

RadheShyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'కి క్రేజీ ఓటీటీ డీల్.. డైరెక్టర్ ఏమంటున్నారంటే..?

RadheShyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'కి క్రేజీ ఓటీటీ డీల్.. డైరెక్టర్ ఏమంటున్నారంటే..?

Raviteja: 'ఫుల్ కిక్కు..' సాంగ్.. రవితేజ నుంచి మాసివ్ ట్రీట్..

Raviteja: 'ఫుల్ కిక్కు..' సాంగ్.. రవితేజ నుంచి మాసివ్ ట్రీట్..

Keerthi Suresh: 'లక్కు లే.. గిక్కు లే.. నా రిలీజ్‌కి..' బ్యాడ్ లక్ రూమర్స్ పై కీర్తి స్ట్రాంగ్ కౌంటర్.. 

Keerthi Suresh: 'లక్కు లే.. గిక్కు లే.. నా రిలీజ్‌కి..' బ్యాడ్ లక్ రూమర్స్ పై కీర్తి స్ట్రాంగ్ కౌంటర్.. 

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం

East Godavari: మూడుగా విడిపోనున్న తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు పేర్లపైనే అసలు పంచాయితీ

East Godavari: మూడుగా విడిపోనున్న తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు పేర్లపైనే అసలు పంచాయితీ