Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - వెంకీ కాంబినేషన్‌లో ఆదర్శకుటుంబం రిలీజ్ అయింది. మరో రెండు రోజుల్లో OTTకి వస్తున్న ఈ మూవీపై నటి పూజిత పొన్నాడ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Pujitha Ponnada on AK47: వెంకటేష్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆదర్శ కుటుంబం AK47 సినిమా చుట్టూ వివాదం రేగుతోంది. ఆ సినిమాలో నటించిన నటి పూజిత పొన్నాడ.. తనను మూవీ నుంచి అర్థాంతరంగా తప్పించారని.. తన రోల్‌ను తగ్గించారని చేసిన కామెంట్స్ పై బాగా చర్చ నడుస్తోంది. రైటర్‌గా త్రివిక్రమ్- యాక్టర్‌గా వెంకటేష్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. 23 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో వెంకటేష్ కలిసి పనిచేశారు. ఆదర్శకుటుంబం AK47 పేరుతో ఓ డిఫరెంట్ జానర్ సినిమాను అందించారు. అయితే చాలా ఎక్కుువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ స్థాయికి చేరుకోలేదు. త్రివిక్రమ్- నాగవంశీ కలిసి నిర్మించిన ఈ సినిమా వాళ్లకి డిజప్పాయింట్‌మెంట్‌ను అందించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన పూజిత పొన్నాడ చేసిన కామెంట్స్ ఇంకో షాక్ ఇచ్చాయి.
పెద్ద రోల్ అన్నారు.. కానీ..
నటి పూజిత పొన్నాడ.. రంగస్థలం వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ ఆమెకు గుర్తించుకోదగ్గ రోల్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తామని చెప్పి, చివరకు అర్థాంతరంగా పక్కన పెట్టారని ఆమె కామెంట్ చేసినట్లుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. " ఈ సినిమా కోసం నన్ను పిలిచినప్పుడు నేను లండన్‌లో ఉన్నా. మూవీ అసోసియేట్ డైరక్టర్ నాకు కాల్ చేశారు. సినిమాలో నాది చాలా పెద్ద రోల్, మూవీ అంతా ఉంటుంది. నారా రోహిత్‌తో కలిసి చేయాల్సి ఉంటుంది... యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని చెప్పడంతో నేను బాగా ఎక్సైట్ అయ్యాను. దీంతో వెంటనే ఓకే చెప్పాను." కానీ సినిమాలోకి వచ్చే సరికే అంతా మారిపోయిందని పూజిత బాధపడిపోయారు. ఆమె చెప్పిన దాని ప్రకారం.. లుక్ టెస్టులు, ఫొటోషూట్ పూర్తయిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశారంట.. సినిమా కన్ఫామ్ కావడంతో అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నారా రోహిత్ కాంబినేషన్‌లో తనతో ఐదు రోజులు షూటింగ్ కూడా చేశారు.
షూటింగ్ అయింది.. నో రెస్పాన్స్..
ఐదు రోజుల షూటింగ్ తర్వాత మళ్లీ ఆమెను చిత్ర బృందం పిలవలేదు. దీనిపై అడిగినా కూడా మూడు నెలల పాటు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని పూజిత చెప్పారు. అయితే మూడు నెలల తర్వాత తన స్థానంలో మరో నటిని తీసుకుంటున్నామని ఆమెకు చెప్పారంట.. కానీ సినిమా చూస్తే.. మరో నటిని కూడా తీసుకున్నట్లు లేదు. మొత్తం మీద కథనాన్ని కొద్దిగా మార్చుుకున్నట్లు తెలుస్తుంది. అయితే పూజితతో ఐదు రోజులు షూటింగ్ చేసిన టీమ్.. అదంతా కాకుండా ఓ చిన్న సన్నివేశాన్ని సినిమాలో పెట్టారు. తన పోర్షన్ పూర్తిగా షూట్ చేయకుండా.. చేసిన దాన్ని కూడా మొత్తం కాకుండా కేవలం ఓ చిన్న షాట్‌లో తనను ఉంచడం పూజితను హర్ట్ చేసింది. ఈ విషయాన్నే ఆమె పంచుకున్నారు. తనను సినిమా నుంచి పూర్తిగా తొలగించినా బాగుండేదని.. అలా ఏమాత్రం ప్రాధాన్యం లేని ఓ షాట్‌లో ఉంచడం తన కేరీర్‌కు ఇబ్బందని తాను వాపోతోంది. జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తోంది.
సినిమాల్లో చాలా మంది కేరక్టర్స్ ఎడిటింగ్‌లో నిడివి తగ్గిపోవడం.. లేదా పూర్తిగా ఎగిరిపోవడం చాలా సందర్భాల్లో జరిగే విషయమే. అయితే ఇక్కడ తనకు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా జరిగిందని పూజిత చెబుతోంది. తన కేరక్టర్ ఫిట్ కాకపోతే.. పూర్తిగా తొలగించి ఉండాల్సిందన్నది ఆమె ఫీలింగ్. రెండు రోజుల్లో ఈ సినిమా OTTలోకి వస్తోంది. ఇప్పుడే ఈ కాంట్రవర్సీ వచ్చింది. దీనిపై డైరక్టర్ త్రివిక్రమ్, నిర్మాణ సంస్థ ఎక్కడా రియాక్ట్ కాలేదు.
ట్రెండింగ్ వార్తలు






















