అన్వేషించండి
Advertisement
NagaChaitanya: బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెతోనే.. సమంతపై చైతు కామెంట్స్..
రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడారు నాగచైతన్య. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
అక్కినేని నాగచైతన్య.. తన మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లైన నాలుగేళ్ల తరువాత ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై సమంత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పటికీ.. చైతు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమా ప్రమోషన్స్ లో తొలిసారి తన విడాకుల గురించి మాట్లాడారు నాగచైతన్య.
ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని.. ఇప్పుడు తను హ్యాపీ.. నేను హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడారు నాగచైతన్య. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 'మీరు నటించిన హీరోయిన్లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో కుదిరింది..?' అనే ప్రశ్నకు వెంటనే సమంత పేరు చెప్పారు చైతు.
ప్రస్తుతం చైతు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి తొలిసారి 'ఏ మాయ చేసావే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే టాక్ వచ్చింది. ఆ తరువాత కూడా మూడునాలుగు సినిమాల్లో కలిసి నటించారు.
ఇదే ఇంటర్వ్యూలో చైతు.. అలియా భట్, దీపికా పదుకోన్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి నటించాలనుందని చెప్పారు. అలియా, దీపికాల పెర్ఫార్మన్స్ తనకు బాగా నచ్చుతుందని.. అలాంటి వారితో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. సంక్రాంతి కానుకగా చైతు నటించిన 'బంగార్రాజు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆట
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion