అన్వేషించండి
Advertisement
Lata Mangeshkar Health: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ అప్డేట్..
వారం రోజులు గడిచినా కానీ.. లతా మంగేష్కర్ ని వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలుస్తోంది
లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్(92) కరోనా బారిన పడ్డారు. దాంతో ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ధృవీకరించారు.
వారం రోజులు గడిచినా కానీ.. ఆమెని వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలుస్తోంది. లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని తాజాగా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది' అని వెల్లడించారు.
లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సైతం ఈ విషయంపై స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో అనుమతించడం లేదని అన్నారు. ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదని.. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు.
Singer Lata Mangeshkar needs care, which is why she'll remain under doctors' supervision in ICU for a few more days. Her condition is the same as before; no one's allowed to meet her yet: Dr Pratit Samdani, who's treating her at Mumbai's Breach Candy Hospital
— ANI (@ANI) January 16, 2022
(file photo) pic.twitter.com/4vMPWxmkr1
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion