అన్వేషించండి
Anaganaga Oka Raju: రాజుగాడి పెళ్లి అదిరిపోవాలంతే.. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టీజర్ చూశారా..?
నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ టీజర్ ను రిలీజ్ చేశారు.

నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టీజర్ చూశారా..?
అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తరువాత 'జాతిరత్నాలు' అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాండమిక్ లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నవీన్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగిపోయాయి. ఒక్కో సినిమాను అనౌన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఆయన భార్య పేరుని నిర్మాతగా వేశారు. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ పోలిశెట్టి తన డైలాగ్స్, కామెడీతో నవ్వించారు. కథ ప్రకారం ఆయన రాజు అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రాజు గాడి పెళ్లి అదిరిపోవాలంటూ టీజర్ లో హడావిడి చేస్తూ కనిపించారు ఈ యంగ్ హీరో. సినిమాకి 'అనగనగా ఒక రాజు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు.
Get Ready for the CRAZIEST WEDDING FUN 🤩
— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2022
The young sensation @NaveenPolishety is coming back with 𝐀𝐍𝐀𝐆𝐀𝐍𝐀𝐆𝐀 𝐎𝐊𝐀 𝐑𝐀𝐉𝐔 👑
Title Teaser ➡️ https://t.co/5hcNKp5IRh#AnaganagaOkaRaju @MusicThaman @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas
Also Read: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..
Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్





















