Chiranjeevi-Rajinikanth: ఈ స్టార్ హీరోలు ఏం సాధించినా.. ఆ ఒక్క విషయంలో మాత్రం..
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకొని దూరమవుతున్నారు. అనవసరమైన గాసిప్స్ కి తావివ్వకుండా.. సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఇది వారిని మాత్రమే కాకుండా.. ఆ జంటల తల్లిదండ్రులకు కూడా ఎంతో బాధను కలిగిస్తోంది. చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున ఇలా స్టార్ హీరోలందరి పిల్లలు విడాకులు తీసుకున్నవారే.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విడిపోవడంతో అభిమానులు షాకయ్యారు. రజినీకాంత్ ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో తన కూతురు విడాకుల విషయం ఆయన్ను మరింత బాధకు గురి చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి తన చిన్న కూతురు శ్రీజ అంటే అపారమైన ప్రేమ. అలాంటిది ఆమె తన తండ్రిని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ భర్తతో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది. దీంతో మెగాస్టార్ కూతురుకి రెండో పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా ఎక్కువకాలం నిలిచేలా లేదు. శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతుందని సమాచారం. ఈ విషయం చిరంజీవిని ఎంతో బాధిస్తుంది.
ఇక కొన్ని నెలల క్రితమే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య తన భార్య సమంతతో విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగార్జున కుటుంబంలో ఇదొక విచారకరమైన సంఘటన. కొడుకు వైవాహిక జీవితం అలా అవ్వడంతో నాగ్ ఎంత బాధ పడి ఉంటారో చెప్పనక్కర్లేదు. సామాన్యుల కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కానీ సెలబ్రిటీ ఇళ్లల్లో ఇలా జరిగితే అది చర్చకు దారి తీస్తుంది.
Also Read: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?
Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?
Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..