
Vikramaditya Movie Poster: 'రాధే శ్యామ్'లో ప్రభాస్ పేరే తేజ కొత్త సినిమా టైటిల్, ఇందులో హీరో ఎవరంటే?
కాలంలో వెనక్కి తీసుకు వెళ్ళడానికి దర్శకుడు తేజ రెడీ అయ్యారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటించారు. ప్రత్యేక ముహూర్తంలో సినిమా వెల్లడించడం గమనార్హం.

ఈ రోజు తేదీ ఏంటి?
22-2-22
ఎటు నుంచి ఎటు చూసినా సేమ్ డేట్!
పైగా, తేదీలో రెండో నంబర్ తప్ప మరో నంబర్ లేదు.
ఈ తేదీన రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు దర్శకుడు తేజ కొత్త సినిమా 'విక్రమాదిత్య' ప్రారంభించారు.
ఈ రోజు (ఫిబ్రవరి 22) తేజ పుట్టినరోజు సందర్భంగా దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న 'అహింస' సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు ప్రీ లుక్ విడుదల చేశారు. ఉదయం ఈ సినిమా కబురు చెబితే... మధ్యాహ్నం మరో సినిమా 'విక్రమాదిత్య' కబురు చెప్పారు. ఈ సినిమా ద్వారా తన కుమారుడు అమితోవ్ తేజ (Director Teja son Amitov Teja to make Telugu Debut with VikramAditya)ను కథానాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు తేజ. కొన్ని సినిమాల్లో అమితోవ్ తేజ (Amitov Teja) బాలనటుడిగా చేశాడని తెలిసింది.
తేజ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న సినిమా 'విక్రమాదిత్య'. ఈ రోజు 2.22 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమానూ అదే సమయానికి ప్రకటించారు. హీరో హీరోయిన్లు ఎవరనేది చెప్పలేదు. కానీ, ప్రీ లుక్‌తో పాటు 1836 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని చెప్పారు. బొగ్గుతో నడిచే ట్రైన్... ఆ పొగలో హీరో హీరోయిన్లు చూపించారు. 'ప్రేమ ఇన్నోసెంట్ గా ఉన్నప్పుడు' అనే కాప్షన్ కూడా ఇచ్చారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తేదీలో, సమయంలో రెండు వచ్చేలా చూసుకున్నారు. సినిమాకు, నంబర్ 2కు లింక్ ఏమైనా ఉందా? లేదా? త్వరలో తెలుస్తుంది.
Also Read: దగ్గుబాటి వారసుడితో తేజ సినిమా - 'అహింస', అది 'అఖండ'లో బాలకృష్ణ డైలాగే!
'విక్రమాదిత్య' పోస్టర్ చూస్తే... కొంత మందికి 'రాధే శ్యామ్' గుర్తుకు వస్తోందట. అది కూడా ట్రైన్ జర్నీ నేపథ్యంలో రూపొందిన చిత్రమే. 'రాధే శ్యామ్' సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు కూడా విక్రమాదిత్య కావడం విశేషం.
Taking you back in the year 1836, when LOVE was INNOCENT ❤️
— LNP (@LNPOfficial) February 22, 2022
Here’s the PRE LOOK POSTER of an Epic Love Story #VikramAditya 🎬
Directed by @tejagaru ❤️🔥
Shoot Begins today🤘
More details to be revealed soon✨@LNPOfficial #NallamalupuSrinivas (Bujji)#HappyBirthdayTeja 💥 pic.twitter.com/fzKTQuqaaY
Also Read: అమితాబ్ బచ్చన్‌ను 'రాధే శ్యామ్'లోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

