Nani: నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
Nani : ప్యారడైజ్ మూవీ విషయంలో ఇచ్చిన మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్ ను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తాజా ఇంటర్వ్యూలో నాని వెల్లడించారు. మ్యాడ్ మ్యాక్స్ అంటే అసలు తన ఉద్దేశం ఏంటో ఆయన వివరించారు.

విలక్షణమైన కథలతో నాని ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని రోజుల క్రితం 'ది ప్యారడైజ్' మూవీ మ్యాడ్ మ్యాక్స్ అంటూ తాను ఇచ్చిన స్టేట్మెంట్ ని కొంతమంది అపార్థం చేసుకున్నారని అన్నారు.
మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్ ని అపార్థం చేసుకున్నారు
తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని 'ది ప్యారడైజ్' మూవీకి సంబంధించిన అప్డేట్ ని షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా నాని మాట్లాడుతూ "ప్యారడైజ్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కొన్ని రోజుల క్రితం ప్యారడైజ్ మ్యాడ్ మాక్స్ అని నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని అపార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ హాలీవుడ్ మూవీ 'మ్యాడ్ మాక్స్' లాంటిది అని రాశారు. కానీ మ్యాడ్ మ్యాక్స్ అంటే మ్యాడ్నెస్ మ్యాక్సిమం ఉండే సినిమా ప్యారడైజ్ అనేది నా అభిప్రాయం. ప్రతి సన్నివేశం ఈ సినిమాలో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. కథ, పాత్ర డిమాండ్ మేరకు ట్రాన్స్ఫార్మేషన్ కావలసి ఉంటుంది. 'దసరా' ఇంటర్వెల్ కు పదిరెట్లు పవర్ ఫుల్ గా ఉండబోతోంది ప్యారడైజ్" అంటూ మ్యాడ్ మ్యాక్స్ అంటే తన అభిప్రాయం ఏంటో వెల్లడించారు.
"#Chiranjeevi Garu is more than just action and dance. We're bringing back what you've been missing from him. It's my big responsibility."
— WC (@whynotcinemasHQ) April 1, 2025
- #Nani.#HIT3 | #ChiruOdela pic.twitter.com/J2lZj1L75Y
అప్ కమింగ్ సినిమాల గురించి...
ఇటీవల నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని హీరోగా 'హిట్ 3', 'ది ప్యారడైజ్' సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల సినిమాను నానినే నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నాని 'హిట్ 3' మూవీ గురించి మాట్లాడుతూ 'హిట్'ను ఫ్రాంచైజీగా తీసుకురావాలని అనుకోలేదని వెల్లడించారు. ఇక 'హిట్ 3'లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని, హిట్ ఫ్రాంచైజీ లోనే ఇది ఒక మాస్ ఫిల్మ్ అని చెప్పారు.
చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ "చిరంజీవి లాంటి హీరోతో నా నిర్మాణ సంస్థలో సినిమా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా చాలా పెద్ద బాధ్యత" అని అన్నారు. అలాగే తాను కథను ప్రేక్షకుడి దృష్టి కోణంలో చూస్తానని అన్నారు నాని. నిజానికి 'కోర్టు' మూవీ ఓటీటీ మూవీ అని చాలామంది అన్నారని గుర్తు చేసుకున్నారు. కానీ ఎడిట్ రూమ్ లో ఈ సినిమా చూశాక మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకాన్ని తను వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు నాని (Nani).





















