By: ABP Desam | Updated at : 13 Nov 2021 04:08 PM (IST)
'జబర్దస్త్' షో వదిలేస్తున్న స్టార్ కమెడియన్..?
బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. దీంతో ఈ షోని కాపీ చేస్తూ చాలా కామెడీ షోలు వచ్చాయి. కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో 'జబర్దస్త్' రేటింగ్స్ తగ్గుతున్నాయి. రొటీన్ స్కిట్ లతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. ఒకట్రెండు టీమ్స్ మినహా.. మిగిలిన వాళ్ల స్కిట్ లను చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు.
Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ను బిట్స్ బిట్స్ గా టెలికాస్ట్ చేస్తుండడంతో.. తమకు నచ్చిన స్కిట్ లను చూసుకుంటున్నారు ఆడియన్స్. దీంతో సరైన రేటింగ్స్ రావడం లేదు. ఇంతలో 'జబర్దస్త్'కి మరో షాక్ తగిలిందట. ఈ షో నుంచి టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్ బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సుధీర్ తో పాటు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఈ ముగ్గురు కలిసి చాలా ఏళ్లుగా స్కిట్ లు చేస్తున్నారు. ఇప్పటికీ తమ పెర్ఫార్మన్స్ తో నవ్విస్తున్నారు. అలాంటిది వీరు ముగ్గురు ఈ షోకి దూరమైతే అది షోపై ప్రభావం చూపడం ఖాయం. ప్రతీ ఏడాది మల్లెమాల సంస్థ ఆర్టిస్ట్ లతో అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయించుకుంటుంది. అయితే ఈ ఏడాది కొత్త అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయడానికి సుడిగాలి సుధీర్ అంగీకరించలేదట. ఇదివరకు అంటే.. వీరందరికీ 'జబర్దస్త్' షో ఒక్కటే ఉండేది.
కానీ ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో రెండు, మూడు షోలు ఉన్నాయి. ఇక సుడిగాలి సుధీర్ అయితే హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే తను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రీసెంట్ గా మరో సినిమాను మొదలుపెట్టాడు. అలానే మరో సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇవి కాకుండా కొన్ని షోలు కూడా ఉన్నాయి. దీంతో 'జబర్దస్త్'కి టైమ్ కేటాయించడం కుదరడంలేదని .. అందుకే షో చేయలేనని సుధీర్ నిర్వాహకులకు చెప్పాడట. మల్లెమాల దగ్గర కూడా సుధీర్ ను అడ్డుకోవడానికి సరైన కారణాలు లేవట. మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Karthika Deepam జూన్ 28 ఎపిసోడ్: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల
Guppedantha Manasu జూన్ 28 ఎపిసోడ్: అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది
Karthika Deepam జూన్ 27 ఎపిసోడ్: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్
Devatha June 27th (ఈరోజు) ఎపిసోడ్: బయటపడ్డ మాధవ్ నిజస్వరూపం- డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రుక్ముణీ
Guppedantha Manasu జూన్ 27 ఎపిసోడ్: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం
Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్