NBK107: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ జంటగా రూపొందుతున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది.
నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఈ రోజు (శనివారం) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
#NBK107 kicks off on an auspicious note with Pooja Event💥
— Mythri Movie Makers (@MythriOfficial) November 13, 2021
Clap by #VVVinayak garu ❤️
Camera Switch on by #BoyapatiSreenu garu ❤️
First shot direction by @harish2you garu ❤️#KoratalaSiva garu, @dirbobby garu, @BuchiBabuSana garu handed over the script to @megopichand garu❤️ pic.twitter.com/KW0KkpTWGk
బాలకృష్ణ, శ్రుతీ హాసన్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మరో దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. చిత్రదర్శకుడు గోపీచంద్ మలినేనికి దర్శకులు కొరటాల శివ, కె.ఎస్. రవీంద్ర (బాబీ), 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందజేశారు.
Our ROARING Film #NBK107 has been launched Today! 💥
— Gopichandh Malineni (@megopichand) November 13, 2021
Extremely thrilled & Excited to move to the sets.. with the LION, #GodOfMasses & our 'Natasimham' #NandamuriBalakrishna Gaaru! 🦁🔥
Will try to present #NBK Gaaru in best possible Avatar! 😊👍🏻#NBK107Begins pic.twitter.com/gNbZOqhcos
"నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఆయన్ను బెస్ట్ గా చూపించడానికి ప్రయత్నిస్తా. టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతీ హాసన్... నా ఊర మాస్ సంగీత దర్శకుడు, నా బావ తమన్ తో మరోసారి పని చేస్తుండటం సంతోషంగా ఉంది. అలాగే, నాకు ఇష్టమైన బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది" అని దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'