Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. ఇందులో తొలి పాట ఈ నెల 15న సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తి కలిగించేలా ఉంది. అదేమిటో చూడండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కారులో షికారుకు వెళ్లారు. అదీ సముద్రంలో! నిజమా? సముద్రంలో కారులో షికారుకు వెళ్లడం సాధ్యమా? అనే సందేహం కలుగుతుందా? అయితే... 'రాధే శ్యామ్'లో తొలి పాట 'ఈ రాతలే' కాన్సెప్ట్ను పోస్టర్ చూడండి. నవంబర్ 15న సాయంత్రం ఐదు గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నిశితంగా గమనిస్తే... అందులో సముద్రంలో పడిన ఓ కారు కనిపిస్తుంది. అందులో ప్రభాస్... ఆయన పక్కన ఓ అమ్మాయి కూర్చున్నట్టు హెయిర్ కనిపిస్తుంది. 'రాధే శ్యామ్' పోస్టర్లలో ముందునుంచి సముద్రాన్ని హైలైట్ చేస్తున్నారు. అది ఈ పోస్టర్ లోనూ కనిపించింది.
The wait is over! ☺️☺️
— UV Creations (@UV_Creations) November 13, 2021
Get ready for the #FirstRadheShyamSong to dominate your playlist! 💓 #RadheShyam
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/HMPELs2Bsz
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో 'రాధే శ్యామ్' తొలి పాట 'ఈ రాతలే...'ను ఈ నెల 15న సాయంత్రం ఐదింటికి విడుదల చేయనున్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీలో కొన్ని రోజుల తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ పాటలో సాహిత్యం, దక్షిణాది పాటల్లో సాహిత్యంలో భావం ఒక్కటే అయినప్పటికీ... అక్కడ వేరే సంగీత దర్శకుడితో బాణీ చేయిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో ఇదొక ప్రయోగం అని చెప్పాలి. దీనికి ప్రభాస్ అండ్ టీమ్ శ్రీకారం చుడుతోంది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ సినిమాకు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also Read: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..