Hero: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి తనయుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'హీరో' విడుదల తేదీ ఖరారైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. హీరోగా అశోక్ తొలి చిత్రానికి 'హీరో' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్టు ఈ రోజు (శనివారం) చిత్ర బృందం వెల్లడించింది. సాధారణంగా సినిమాలను శుక్రవారం విడుదల చేస్తారు. అయితే... గణతంత్ర దినోత్సవం సెలవుల మీద కన్నేసిన 'హీరో' బృందం బుధవారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది.
Ready for Full On Entertainment in Theatres ?!! 🤘🏻😎#HERO is arriving to Cinemas on January 26, 2022! 🔥
— Ashok Galla (@AshokGalla_) November 13, 2021
🌟 #HEROFromJan26th 🌟@AgerwalNidhhi @SriramAdittya @GhibranOfficial #PadmavathiGalla @JayGalla @amararajaent @adityamusic pic.twitter.com/vu4LtVjluw
"థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీనా? జనవరి 26, 2022న సినిమా హాళ్లలోకి 'హీరో' వస్తోంది" అని అశోక్ గల్లా ట్వీట్ చేశారు.సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా 'హీరో' సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
నిజం చెప్పాలంటే... జనవరిలో మహేష్ బాబు సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. 'సర్కారు వారి పాట' సినిమాను ముందు సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే... 'సర్కారు వారి పాట' వాయిదా పడింది. జనవరిలో విడుదల కావడం లేదు. మహేష్ బాబు రాకపోయినా... ఆయన మేనల్లుడు జనవరిలో రావడానికి రెడీ అయ్యారు. మహేష్ బదులు మేనల్లుడిని చూడటానికి అభిమానులు థియేటర్లకు వెళతారన్నమాట.
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'