Liger: అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
'లైగర్' కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం అమెరికాలో వాలిపోయింది. లాస్ వేగాస్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. నిజానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ సినిమానైనా ఆరు నెలల్లో పూర్తి చేసేస్తాడు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అలానే తీశారు. కానీ ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. దానికి చాలా కారణాలున్నాయి.
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
లెజండ్ మైక్ టైసన్ ను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత అమెరికాలో షూటింగ్ కి పర్మిషన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇవి కాకుండా.. కరోనా ఒకటి. ఇలా పలు కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 22 నెలల తరువాత షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కూడా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తీసుకుంటుందని నమ్ముతున్నారు.
మొన్నామధ్య 'రొమాంటిక్' సినిమా ఈవెంట్ లో 'లైగర్' సినిమాను పొగుడుతూ.. 'ఆగ్ లగా దేంగే' అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు. ఇదంతా కూడా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్. ఇక కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం అమెరికాలో వాలిపోయింది. లాస్ వేగాస్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.
ఈ షూటింగ్ లో మైక్ టైసన్ తో కలిసి ఫైట్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. సినిమాలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అయితే షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఛార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.
View this post on Instagram
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















