Seethe Ramudi Katnam August 17th: పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్- సీతను కోడలిగా అందరి ముందు ఒప్పుకున్న మహాలక్ష్మి
Seethe Ramudi Katnam August 17th: అత్తాకోడళ్ల మధ్య జరుగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లతో సీతే రాముడి కట్నం సీరియల్ చాలా ఆసక్తిగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode: ఆషాడం తర్వాత సీత నా కోడలే అని మహాలక్ష్మితో చెప్పిస్తానని ఛాలెంజ్ చేసుకున్న ఇరువురు ఒకరిపై ఒకరు ఎత్తుకుపై ఎత్తులు వేస్తుంటారు. అందులో భాగంగానే ఆషాడం ఉన్నప్పటికీ సీత, రామ్ పక్కింట్లో కలుస్తుంటారు. దీన్ని చెడగొట్టేందుకు మహాలక్ష్మి అండ్ బ్యాచ్ చేయని ప్రయత్నం లేదు.
ఆషాడం మాసం ఆఖరి రోజు రాత్రి పక్కింట్లోకి దొంగచాటున వెళ్లిన సీతను రామ్ కలుస్తాడు. రామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు జనార్దన్, గిరిధర్ ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీత ఇద్దరు మామలకు బుద్ది చెప్పాలని అనుకుంటుంది. వాళ్లు దగ్గరకు వచ్చే వరకు వేచి చూసి దొంగలని గట్టిగా అరుస్తూ దుప్పటి కప్పి కుమ్మేస్తుంది.
వచ్చింది తన తండ్రి, బాబాయ్ అని తెలుసుకోలేని రామ్ కూడా రెండు దెబ్బలు వేస్తాడు. దొంగలు వచ్చి మూడ్ చెడగొట్టారని తిట్టుకుంటాడు. అయితే రేపటితో ఆషాడం అయిపోతుందని ఇద్దరం ఇంట్లోనే కలవచ్చని చెప్పేస్తుంది సీత.
ఇంతలో దెబ్బలు తిన్న జనార్దన్, గిరిధర్ ఇంటికి వస్తుంటే అప్పుడే వచ్చిన మహాలక్ష్మి బ్యాచ్ ఏం జరిగిందని అడుగుతారు. జరిగిన విషయాన్ని జనార్ధన్ చెబుతాడు. చెప్పిన ఒక్క పని కూడా సరిగా చేయరా అని విసుక్కుంటుంది. అసలు రామ్ ఇంట్లో ఉన్నాడో లేడో అనే అనుమానంతో బెడ్‌రూమ్‌కి వెళ్లి చూస్తారు. అక్కడ రామ్ ఉండటాన్ని చూసి షాక్ అవుతారు.
రేపటితో ఆషాడం అయిపోతుందని ఇప్పుడే ఇన్ని చేసిన సీత ఒకసారి ఇంటికి వచ్చిందంటే ఇంకెన్ని చేస్తుందో అని భయపడతారు కుటుంబ సభ్యులు. మహాలక్ష్మి వాళ్లకు భరోసా ఇస్తుంది. సీత ఎప్పటికీ ఈ ఇంటికి రాకుండా చేస్తాను అని వాళ్లకు ధైర్యం చెబుతుంది.
సీన్ కట్ చేస్తే ఉదయాన్నే సీత ఉంటున్న ఇంటికి పోలీసులు వస్తారు. రోజూ ఎవరో వ్యక్తి మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని కాలనీవాసులు కేసు పెడతారు. సీతను అరెస్టు చేయాలని పోలీసులు చెప్పడంతో తనతోపాటు వచ్చిన వ్యక్తిని కూడా అరెస్టు చేయాలని సీత డిమాండ్ చేస్తుంది. కాలనీ వాసులు కూడా అందుకు అవుననే అంటారు.
ఇంతలో ఇక్కడ సీతమను శాశ్వతంగా పుట్టింటికి పంపించే ప్లాన్ వేశానని మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతుంది. ఇంతలో పోలీసులు రావడం, రామ్ కోసం ఎంక్వయిరీ చేయడం కుటుబం సభ్యులంతా కంగారు పడటం జరుగుతుంది.
ఇంట్లో ఉన్న రామ్‌ను పోలీసులు తీసుకెళ్తారు. రామ్‌తోపాటు మిగతా కుటుంబ సభ్యులు వచ్చి ఏం జరిగిందని ఎందుకు పోలీసులు వచ్చారని అడుగుతూ కాలనీలోకి వస్తారు. మళ్లీ సీత ఏం చేసిందో అని కోపంతో వస్తారు. జరిగిందని కాలనీ వాసులు చెప్పడంతో అవును సీతను అరెస్టుచేయాలని మహాలక్ష్మి కూడా డిమాండ్ చేస్తుంది.
తన వద్దకు రోజూ వచ్చింది రామ్ అని సీత చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అందుకు ప్రూఫ్ ఏంటని మహాలక్ష్మి నిలదీస్తుంది. అయితే అతను వచ్చేటప్పుడు వీడియో రికార్డ్స్ చేశామని కాలనీ వాసులు చెప్పడంతో మహాలక్ష్మి షాక్ తింటుంది.
ఎందుకు రోజూ వస్తున్నావని రామ్‌ను కాలనీ వాసులు, పోలీసులు నిలదీస్తారు. సీత తన భార్య అని చెబుతుంటే మహాలక్ష్మి వారిస్తుంది. అలా చెప్పొద్దని అడ్డుకుంటుంది. ఇలా చెప్తే తన పరువు పోతుందని అంటుంది. అవసరమైతే బెయిల్ ఇప్పిస్తాని జైలుకు వెళ్లమని కూడా సలహా ఇస్తుంది.
కాసేపు తటపటాయించిన రామ్.. చివరకు సీతే తన భార్య అని చెప్తాడు. అంతా షాక్ అవుతారు. సీత తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా చూపిస్తుంది. అయినా పోలీసులు, కాలనివాసులు నమ్మరు. తప్పించుకోవడానికి ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారని అనుమానపడతారు.
నమ్మకమైన వాళ్లు చెబితే ఓకే అంటారు. కుటుంబ సభ్యులంతా రామ్ సీత భార్యభర్తలనే చెప్పినా ఎవరూ నమ్మరు. మహాలక్ష్మి చెబితే తమకు నమ్మకంగా ఉంటుందని అంటారు. రోడ్డుపై నిలబడ్డామని పోలీసు స్టేషన్‌కు వెళ్లడం కంటే కాలనీలో పరువు పోవడం మంచిదని ఒప్పుకోమని మహాలక్ష్మిని రిక్వస్ట్ చేస్తారు.
అందరి ఒత్తిడితో సీతే తన కోడలని అందరి ముందు మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. సీతే రామ్ భార్య అని చెబుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: శ్రీముఖి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ లుక్.. బంగారు కళ్ల బుచ్చమ్మలాగా ఉంది కదూ