స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బాక్సాఫీసు వద్ద మూడు భారీ చిత్రాలు పోటీ పడ్డాయి అవే రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ తంగలాన్ తమిళ చిత్రమైన అయినా తెలుగులోనూ ఈ సినిమాకు బజ్ నెలకొంది అయితే ఇందులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నాయి తమిళ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ డే రూ.7.5 కోట్ల వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం ఇక డబుల్ ఇస్మార్ట్ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు తంగలాన్ మొదటి రోజు వరల్డ్ బాక్సాఫీసు వద్ద రూ. 26.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది