అన్వేషించండి

Meghasandesam Serial Today October 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వతో చాలెంజ్‌ చేసిన భూమి – ప్రసాద్‌ ను తిట్టిన ఇందు  

Meghasandesam Today Episode: మా నాన్న చేత నేనే ఆయన కూతురిని అని చెప్పిస్తానని భూమి, అపూర్వతో చాలెంజ్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  అపూర్వ  గట్టిగా నవ్వుతూ.. తెలిసిపోయిందా? అంటూ అవును మీ అమ్మను చంపింది నేనే.. నాది అనుకున్న నా స్థానానికి శోభ అడ్డుగా ఉంది. అందుకే  మీ అమ్మను చంపేసాను అంటుంది. ఊహ తెలిసినప్పటి నుంచి బావే సర్వస్వం అనుకున్నాను అలాంటి నా బావను లాగేసుకుంది మీ అమ్మా అందుకే చంపేశాను అంటూ కోపంతో చెప్తుంది అపూర్వ. నువ్వేం చేస్తావు. దేనికి సాక్ష్యం లేదు. ఇరవై ఏళ్ల నమ్మకం నావైపు ఉంది. నీ దగ్గర ఏం ఉంది అంటూ ప్రశ్నిస్తుంది.

భూమి: అదే కదా నీ ధైర్యం అమ్మ కడుపు నుంచి పుట్టిన దాన్ని కాదు నేను అమ్మ చావు నుంచి పుట్టినదాన్ని. కళ్లు తెరవగానే బిడ్డను నీళ్లతో కడుగుతారు. నన్ను మా అమ్మ నిప్పుతో కడిగింది. చావును గెలిచి బతికిన నాకు నిన్ను గెలవడం పెద్ద లెక్కేం కాదు అపూర్వ. ఇన్నేళ్ల తర్వాత ఇంటి దాకా రాగలిని నేను.. నేనే శోభాచంద్ర బిడ్డనని తెలిసేలా చేస్తాను.

అపూర్వ: అది జరగదు.. జరగనివ్వను.

భూమి: ప్రయత్నించి చూడు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నేను ఎవరో మా నాన్నాకు అందరికీ తెలిసేలా చేస్తాను. అంతటితో వదిలేస్తాను అనుకోకు. మా అమ్మ చావుకు కారణం అయిన నిన్ను పదింతలు బాధపడేలా చేస్తాను.

అపూర్వ: ఈ అపూర్వతోనే చాలెంజ్‌ చేస్తున్నావా?

భూమి: చాలెంట్‌ అనుకుంటే చాలేంటే..

అపూర్వ: చచ్చిపోతావు.

భూమి: చంపడమే నీకు తెలుసు. చావుని గెలవడం నాకు పుట్టుకతోనే తెలుసు. భూమి నా  కూతురు అని మా నాన్నతోనే చెప్పిస్తాను.

 అంటూ ఇద్దరూ ఒకరికి ఒకరు చాలెంజ్‌ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. పెళ్లిమంటపంలోకి అపూర్వ, భూమి కలిసి వస్తారు. వారినే కృష్ణప్రసాద్‌ గమనిస్తుంటాడు. మాట్లాడాను అన్నట్టు భూమి, ప్రసాద్‌ కు సైగ చేస్తుంది. ఇంతలో పంతులు పెళ్లి కూతురు అమ్మా నాన్నా వచ్చి పూజ చేయండి అని చెప్తాడు.

ఇందు: వద్దు ఆయన వచ్చి నాకోసం పూజ చేయాల్సిన అవసరం లేదు. నా పెళ్లికి ఆయన రాకపోయినా పర్వాలేదని చెప్పాను. ఇక్కడ ఉండి అక్కడ ఆలోచించే ఆయన పూజ చేయడం నాకు ఇష్టం లేదు.

మీరా: మీ నాన్నను పట్టుకుని అలా మాట్లాడొచ్చా ఇందు.

శరత్: తప్పమ్మా అలా మాట్లాడకూడదు.   

ఇందు:  కూతురు పెళ్లి ఏమైనా సరేనని ఆయన పాటికి ఆయన వెళ్లిపోయాడు.

    అంటూ ఇందు మాట్లాడుతుంటే అందరూ ఇందును తిడతారు. ప్రసాద్‌ మాత్రం తనకు ఇష్టం లేకపోతే ఎందుకులే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే శరత్‌ చంద్ర ఆగమని చెప్పి ఇందును తిట్టి పూజలో మీరా, కృష్ణ ప్రసాద్‌లను కూర్చోబెడతాడు. తర్వాత ఆఫీసులో కూర్చున్న గగన్‌ కోపంగా శరత్‌చంద్ర మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతలో అక్కడకు బొకే తీసుకుని భూమి అక్కడకు వస్తుంది. భూమిని చూసిన గగన్‌ కోపంగా ఆఫీస్‌ బాయ్‌ ని పిలిచి ఎవర్ని పడితే వాళ్లను లోపలకి రానిస్తారా? బయటకు తోసేయండి అంటాడు. గగనే భూమి గొంతు పట్టుకుని నిన్ను చంపేస్తాను అంటూ గొంతు నులుముతుంటాడు. ఇంతలో అక్కడకు శారద వస్తుంది.

శారద: గగన్‌ ఏం చేస్తున్నావురా.?

గగన్‌: చంపేస్తున్నాను..

శారద: ఎవరిని..?

గగన్‌: ఈ భూమిని నా గురించి చాలా మాట్లాడుతుంది.

శారద: ఎక్కడుంది…?

   అని శారద అడగ్గానే అక్కడు ఎవరూ ఉండరు. గగన్‌ కలగంటుంటాడు.  ఎందుకురా ఆ అమ్మాయి అంటే అంత కోపం అంటూ ఆ అపూర్వ నుంచి నిన్ను కాపాడాలని నీ మీద చేయి చేసుకుంది దానికి అంత కోపం తెచ్చుకోవాలా? అంటుంది శారద. దీంతో గగన్‌ కోపంగా నన్ను కొట్టిన విషయం నీకు కూడా చెప్పిందా..? అనగానే ఆ అమ్మాయి చెప్పలేదురా…? అంటూ అపూర్వ పోలీసులకు ఫోన్‌ చేసి నిన్ను అరెస్ట్ చేయమని.. తర్వాత ఎన్‌కౌంటర్‌ చేయమని చెప్పడం విని నిన్ను కాపాడాలని నీ మీద చేయి చేసుకుంది అని గగన్ ను కన్వీన్స్‌ చేస్తుంది శారద. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget