అన్వేషించండి

Krishna mukunda Murari November 4th : మురారికి డాక్టర్ నిజం చెబుతుందా - ఎవరినో చూసి ముకుంద ఎందుకు భయపడుతోంది!

హాస్పిటల్ లో మురారికి డాక్టర్ నిజం చెప్పిందా? ముకుంద రెస్టారెంట్ లో ఎవరినో చూసి ఎందుకు భయపడింది లాంటి ట్విస్టులతో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా సాగింది.

Krishna mukunda Murari November 4th: కృష్ణ, మురారి ఇద్దరే హాస్పిటల్‌కు  వెళ్లి ఉంటే బాగుండు కాని వాళ్లతో పాటు ముకుంద వెళ్లింది అక్కడ మళ్లీ ఏం డ్రామా ఆడుతుందో ఏమో అంటూ అనుమానిస్తుంది రేవతి. అయితే ముకుంద ఏమీ చేయలేదని అన్ని చూసుకోవడానికి కృష్ణ ఉందని.. మురారికి కృష్ణను ఎందుకు దూరం పెడుతున్నారోనన్న అనుమానం మొదలైందని చెప్తాడు మధు.

రేవతి: నువ్వు చెప్పిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది.

మధు: మళ్లీ ఏమైంది పెద్దమ్మ.. చెప్పానా నీకు సంతోషం కన్నా బాధే ఎక్కువ ఇష్టం అని.

రేవతి: అది కాదురా  దానికి జ్వరం వచ్చిందని బాధపడాలో..  దాని మొగుడు హాస్పిటల్‌ కు తీసుకెళ్లాడని సంతోష పడాలో అర్థం కావడం లేదు మధు.

మధు: నీ దగ్గర వన్‌ రూపీ కాయిన్‌ ఉందా? టాస్‌ వేద్దాం హెడ్‌ పడితే సంతోషించు.. టేల్‌ పడితే బాధపడు..

అనగానే ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు.

మురారి, ముకుంద కారులో హాస్పిటల్‌ ముందు వచ్చి ఆగుతారు.

ముకుంద: మురారి ఈ హాస్పిటల్‌ నీకెలా తెలుసు

మురారి: లేదు గతం మర్చిపోయిన తర్వాత నేను ట్రీట్‌ మెంట్‌ తీసుకున్న హాస్పిటల్‌ ఇదే

అని ఇద్దరూ కారు దిగి కృష్ణని చూడగానే కారులో కృష్ణ  సృహతప్పి ఉంటుంది.   మురారి కంగారుగా కృష్ణని ఎత్తుకుని హాస్పిటల్‌లోకి తీసుకెళ్తాడు. నర్సు వచ్చి వివరాలు తెలుసుకుని డాక్టర్‌ని  పిలుస్తుంది. డాక్టర్‌ వచ్చి కృష్ణని టెస్ట్‌ చేస్తుంది. మురారిని చూసిన డాక్టర్‌ ఈయనకు  గతం గుర్తు రానట్లుంది అనుకుంటుంది.  డాక్టర్‌ కృష్ణను వెంటనే లోపలికి తీసుకువెళ్దాం పదండి అంటుంది ముకుంద. డాక్టర్‌  కృష్ణను లోపలికి తీసుకువెళ్తుంది. మురారి బయటే ఉండిపోతాడు.  డాక్టర్‌ కృష్ణకు ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తుంది.

 డాక్టర్‌: అదేంటి మురారికి గతం గురించి చెప్పలేదా?

ముకుంద: అదే డాక్టర్‌ ఎక్కడ మీరు చెప్పేస్తారో నని  టెన్షన్‌ పడ్డాను.

డాక్టర్‌ : చెప్తే బ్రెయిన్‌ డ్యామేజ్‌ అవుతుందన్నారా?

ముకుంద: అవును డాక్టర్‌

బయట నుంచున్న మురారికి ఎవోవో గుర్తుకు వస్తుంటే ఈ హాస్పిటల్‌ ఈ డాక్టర్లను ఎక్కడో చూసినట్లు ఎప్పుడో మాట్లాడినట్లు అనిపిస్తుంది అనుకుంటాడు. కృష్ణకు జ్వరం తగ్గాక నాకు గతంలో తాను తెలుసేమో అడగాలి అనుకుంటాడు మురారి. లోపల కృష్ణకు సృహ వస్తుంది. మురారి ఎక్కడ అని అడుగుతుంది. మెడిసిన్స్‌ తీసుకురావడానికి వెళ్లాడని డాక్టర్‌ చెప్తుంది. నిన్ను మురారి తన చేతులతో ఎత్తుకుని హాస్పిటల్‌లోకి తీసుకొచ్చాడని బంధమంటే అదేనని..నువ్వు ఎదురుగా ఉంటే మురారికి గతం గుర్తు చేయకున్నా గుర్తుకు వస్తుందని డాక్టర్‌ చెప్తుంది. మురారి మెడిసిన్స్‌ తీసుకుని వస్తారు. కృష్ణ లేచి కూర్చోవడం చూసి

Also Read: తులసికి నోటీసు పంపిన రత్నప్రభ – లాస్యను సమర్థించిన నందగోపాల్

మురారి: డాక్టర్‌ తగ్గిపోయిందా? మీరు నిజంగా సూపర్ డాక్టర్‌.

డాక్టర్‌: నాదేం లేదు మురారి అంత కృష్ణలో ఉన్న కాన్ఫిడెంసియల్‌ లెవల్స్‌.

మురారి: మరి ఈ మెడికేషన్‌ అవసరం లేదా?

డాక్టర్‌ : ముందు అలా కూర్చోండి.

అనగానే మురారి, కృష్ణ పక్కన కూర్చుటాడు. ఇంతలో వార్డు బాయ్‌ టీ తీసుకొస్తాడు. మురారి టీ తీసుకుని కృష్ణకు ఇస్తాడు. కృష్ణ గురించి డాక్టర్‌ చాలా గొప్పగా చెప్తుంది. హౌస్‌ సర్జన్‌లో అవార్డు అందుకుందని అలాగే చాలా బబ్లీగా ఉంటుందని చెప్తుంది. తర్వాత అందరూ హాస్పిటల్‌ నుంచి వెళ్తూ డాక్టర్‌ను తాను ఎక్కడో చూశానని అంటాడు మురారి. కారులో వెళ్తూ ఒక రెస్టారెంట్‌ ముందు ఆగిన మురారి ఈ రెస్టారెంట్‌ నేను ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుందని లోపలికి వెళ్తాడు.

మురారి: ఈ ప్లేస్‌ ఎప్పుడో చూశాను. కచ్చితంగా చూశాను. కానీ ఎప్పుడొచ్చానన్న విషయం గుర్తుకు రావడం లేదు. ఎందుకో ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడే టిఫిన్‌ తిన్నట్లనిపిస్తుంది. ఇది మాత్రం నిజం నేనిక్కడికి నిజంగానే వచ్చాను.

Also Read: కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలి - ఓవైపు రొమాన్స్ మరోవైపు రివెంజ్ - రిషిధారలు అస్సలు తగ్గట్లేదు

ముకుంద : మురారి అందుకే వద్దన్నాను పద వెళ్దాం మురారి.

మురారి: స్టాపిట్‌ ముకుంద ఎప్పుడూ వెళ్దాం వెళ్దాం అంటుంటావ్‌ ఎందుకు?

కృష్ణ : సార్‌ కంట్రోల్‌ అవ్వండి ప్లీజ్‌ అప్పుడు మీకు అన్ని గుర్తొస్తాయి. మీరు కూర్చోండి.

అనగానే మురారి రిలీఫ్‌ అవుతాడు. ఇంతలో టిఫిన్స్‌ వస్తాయి. టిఫిన్స్‌ తింటుంటే కూడా మురారి  పాత విషయాలు గుర్తుకు చేసుకుంటుంటే..  పక్క టేబుల్‌ లో వచ్చి కూర్చున్న  వ్యక్తిని చూసి ముకుంద భయపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ పూర్తి అవుతుంది.

Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget