Guppedantha Manasu November 3rd Episode: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!
Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu November 3rd Episode (గుప్పెడంతమనసు నవంబరు 3 ఎపిసోడ్)
ఆ రోజు అమ్మ ఇంట్లోంచి బయలుదేరడం నాకు, అమ్మకు మాత్రమే తెలుసు..మరి జగతి మేడం బయటకు వచ్చినట్టు ఎలా తెలిసిందో అని రిషి అంటే జగతి మేడం ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నా తెలుస్తుంది కదా అంటాడు ముకుల్. అప్పుడు స్పందించిన వసు... నిజమే సర్..ముందు మనం మన చుట్టుపక్కలవారిని, మనం అనుకున్నవాళ్లని ఇన్వెస్టిగేషన్ చేయడం మంచిదేమో అంటుంది. అసలు ఇన్వెస్టిగేషన్ ఇంటి నుంచే మొదలెడతాం అంటాడు ముకుల్.
దేవయాని: మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు..మేం చాలా అన్యోన్యంగా ఉంటాం..ఎవరో బయటవాళ్లే కారణం..
వసు: అలా ఏముంది అత్తయ్యా..చాలా కేసుల్లో ఇంట్లో వాళ్లే నేరస్తులు అవుతున్నారు.. మనమే కావాల్సిన అవసరం లేదు..మనల్ని ఆధారంగా చేసుకుని వెనుక గోతులు తీసేవారుంటారు కదా..అది మీరైనా కావొచ్చు, నేనైనా కావొచ్చు, శైలేంద్ర సార్ అయినా కావొచ్చు.. రాజ్యాల కోసం అన్నదమ్ములు యుద్ధాలు చేసుకున్న చరిత్ర మనది...
ఫణీంద్ర: నిజమేనమ్మా..ఇదంతా వాళ్ల స్వార్థంకోసమే చేస్తున్నారు..కానీ ఏం ఆశించి చేస్తున్నారో తెలియడం లేదు
ముకుల్: సర్ మీకు ఎవరిపైన అయినా అనుమానం ఉందా
వసు: MSR ఉన్నాడు కదా
ముకుల్: MSR ఎవరు
రిషి: రెండుమూడుసార్లు మా కాలేజీని దక్కించుకోవాలని ప్లాన్ చేశాడు..నేను వార్నింగ్ ఇచ్చాను కూడా..అయినా తను మోసగాడే కానీ హత్యలు చేసేవాడు కాదనిపిస్తోంది.. తను అలా కనిపించడు
వసు: మోసం చేసేవాళ్లు అలా కనిపించరు..
ముకుల్: జగతి మేడంని కలుస్తున్నట్టు తనకి-జగతిమేడం కి తప్ప ఎవ్వరికీ తెలియదన్నారు కదా మరి మీకెలా తెలిసింది
వసు: సర్ కాలేజీ నుంచి హడావుడిగా బయలుదేరారు..గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి..అప్పుడు కూడా ఏదైనా జరుగుతుందా అనే భయంతో ఫాలో చేశాను
రిషి: అవును పాండ్యన్ కి నేనే లొకేషన్ చెప్పాను
ముకుల్: అసలు వసుర దాడులేంటి...ఎప్పటి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి
ధరణి: మా ఆయన ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచీ
దేవయాని: అలా అంటావేంటి ధరణి..తను వచ్చినప్పటి నుంచీ మన సమస్యలలో పాలుపంచుకుంటోంది
శైలేంద్ర: చాలాసార్లు తనతో చెప్పుకుని బాధపడ్డాను..అదే విషయం ధరణి ఇలా చెప్పింది..
ముకుల్; అసలు జగతి మేడం బయటకు వెళ్లిన విషయం బయటివాళ్లకి ఎలా తెలిసింది..మీలో మీకు తెలియకుండా శత్రువులున్నారా మొత్తం కనుక్కుంటాను
శైలేంద్ర: మీరు అలా అనకండి..మా ఇంట్లో ఎవరూ శత్రువులు లేరు.. మీకు అలాంటి అనుమానం వచ్చే మా భూషణ్ ఫ్యామిలీనే అనుమానించినట్టే
రిషి: స్పెషల్ ఆఫీసర్ గా ఆయన ఎన్నో కోణాల్లో విచారించాలి..అందరం సహకరించాలి
ఫణీంద్ర; నువ్వెందుకు ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటున్నావ్
శైలేంద్ర: మన ఫ్యామిలీ పరువు పోతుందని...
ఫణీంద్ర; పరువు కన్నా ప్రాణాలు ముఖ్యం..ఆ ప్రాణం తీసినవాడిని ఎలాగైనా పట్టుకోవాలి..కానీ మా ఇంట్లో మా మధ్య మీకు శత్రువులు దొరకరని నా అభిప్రాయం..నాకు నా తమ్ముడంటే ప్రాణం, జగతి అంటే గౌరవం...నా తమ్ముడిని బాధపెట్టాలని ఇంట్లో ఎవరైనా చేశారంటే ముందుగా నేనే ఊరుకోను..మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి...ఎవరైనా సరే పట్టుకుని తీరండి..మీరు మా జగతి స్టూడెంట్ కాబట్టి ఈ కేసుని ఓ బాధ్యతగా తీసుకుంటారని అనుకుంటాను
ముకుల్: దీన్ని నేను పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను..మేడం ఫోన్ నంబర్ డిపార్ట్ మెంట్ కి హ్యాండోవర్ చేశాను, కాల్ లిస్ట్ తెప్పిస్తున్నా... మేడంతో ఎవరు మాట్లాడన్నది త్వరలోనే తెలుస్తుంది...
ఎవర్రా నువ్వు ఇంత ట్యాలెండెలా ఉన్నావ్ అనుకుంటాడు శైలేంద్ర...
ముకుల్ గారు ఎప్పుడొచ్చిన ఇంట్లో అందరూ అవసరమైన సమాచారం ఇవ్వండని రిషి చెబుతాడు...
మళ్లీ కలుస్తా అని చెప్పేసి ముకుల్ వెళ్లిపోతాడు... బై చెప్పేసి రిషి కూడా బయలుదేరుతాడు..వీలు కుదిరినప్పుడు ఇంటికి వస్తుండు అంటుంది
Also Read: ఓ వైపు అనుపమ, మరోవైపు ముకుల్ - దేవయాని, శైలేంద్ర చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న రిషిధార!
రిషి మెట్లపై కూర్చుని ఆలోచనలో పడతాడు. ఇంతలో పూలు తీసుకొచ్చి మాల కడుతూ...ఏం ఆలోచిస్తున్నారని అడుగుతాడు...
ముకుల్ గురించి ముందే చెప్పలేదని ఫీలవుతున్నావా అంటే..మీరు కూడా సడెన్ గా డెసిషన్ తీసుకున్నారు కదా ఎందుకు ఫీలవుతాను, మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారు అంటుంది... థ్యాంక్యూ నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి మైమరచి వసుని చూస్తుంటాడు...
ఈ మల్లెపూలు చూసినప్పుడల్లా నాకు కొన్ని గుర్తొస్తుంటాయంటాడు రిషి ( గతంలో వసుకి పూలు కొనిచ్చిన సంఘటనలు)
వసు: అప్పుడు మీరు నాకు మల్లెపూలు ఎందుకు కొనిచ్చారు
రిషి: అప్పుడంటే కొనిచ్చాను కానీ...ఇప్పుడు కొనివ్వాల్సిన అవసరం లేదులే... ఇప్పుడిలా నా పక్కకు వచ్చి నువ్వే కడుతున్నావ్ కదా.. ఇద్దరం కలసి కడదాంలే
వసు: మీరు పూలు కట్టడం ఎందుకు...
నేను కడతానంటూ పూలు తీసుకుంటాడు...పూలకు ముడివేసేందుకు తంటాలు పడుతుంటే వసు నవ్వుతుంది... చూస్తూ ఉండిపోతాడు రిషి...
( బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ బావుంది).... నీ నవ్వు చాలా బావుంటుందంటూ...నీకు కొన్ని విషయాలు చెప్పాలి అంటాడు
రిషి: మొదట్లో నిన్ను చూసి నాకు మంచి కాలక్షేపం అనుకున్నా, ఆ తర్వాత మొండితనం చూసి పొగరు అనుకున్నాను, టాలెంట్ చూసి మంచి సబ్జెక్ట్ ఉంది అనుకున్నాను, తోడుగా ఉండడం చూసి నాకు సపోర్ట్ గా ఉంటుంది అనుకున్నాను.. ఇలా అనుకున్న ప్రతిసారీ నీ నువ్వు చూశాను.. ఈ నవ్వు నా సొంతం కావాలని అనిపించింది.. ఈ మల్లెపూలతో మనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కదా అని రిషి అంటే.. మనకు గాలితో కూడా జ్ఞాపకాలున్నాయి..మనకు జ్ఞాపకాలు లేని ప్రదేశం ఎక్కడుంది అంటుంది.. ఇద్దరూ కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. వసు జడలో పూలు పెట్టిన రిషి....ఎంత అందంగా ఉన్నావో అని కాంప్లిమెంట్ ఇస్తాడు...మల్లెపూలలానే మన బంధం స్వచ్ఛంగా ఉండాలి అనుకుంటారు
Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి
అటు శైలేంద్ర...నేను ఏం చేయలేకపోతున్నానంటూ బెల్ట్ తీసి తనని తాను కొట్టుకుంటాడు..ఇంతలో దేవయాని వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థంమవుతోందా అని అడ్డుకుంటుంది..ఇంతలో ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. ఆయన టెన్షన్ మీ టెన్షన్ తగ్గించడానికి నేను కాఫీ తెచ్చానంటుంది... కాఫీ తాగి మీ తలనొప్పి తగ్గించుకోండి..మళ్లీ కాఫీ కావాలి అనిపిస్తే అర్థరాత్రి అయినా పర్వాలేదు అడగండి ఇస్తానంటుంది. ధరణి అని శైలేంద్ర గట్టిగా అరుస్తాడు..కాఫీ తాగినా కానీ తలనొప్పి తగ్గకపోతే నేను ట్యాబ్లెట్స్ ఇస్తానంటుంది... చూశావా మామ్ తను హద్దు దాటి మాట్లాడుతోందంటాడు..నేను నా హద్దుల్లోనే ఉన్నానంటుంది ధరణి...