అన్వేషించండి

Guppedantha Manasu November 2nd Episode: ఓ వైపు అనుపమ, మరోవైపు ముకుల్ - దేవయాని, శైలేంద్ర చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న రిషిధార!

Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు నవంబరు 2 ఎపిసోడ్

మహేంద్ర-జగతి జ్ఞాపకాలలో మునిగిపోయిన అనుపమకు..తన పెద్దమ్మ ఓ సలహా ఇస్తుంది. నువ్వు మళ్లీ వెనక్కి వెళ్లాలి, నీగతంలోకి వెళ్లాలంటుంది. అది నావల్లకాదని అనుపమ చెప్పినప్పటికీ..
పెద్దమ్మ: నువ్వు వాళ్లకి దూరంగా ఉంటే ఏవేవో ఆలోచించి మనసు పాడుచేసుకుంటున్నావ్, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావు, కోపం తగ్గించుకోవాలి,ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వాళ్లపైనే ఎక్కువగా కోపం వస్తుంది..దానివల్ల అనర్థాలు పెరుగుతాయి..అందుకే నార్మల్ గా ఉండేందుకు ప్రయత్నించు..ఇంకా ఆలోచిస్తావేంటి..నువ్వు అందర్నీ వదిలేసి దూరం వెళ్లిపోయావు..ఎవర్ని అయితే వదిలేశావో వాళ్లని మళ్లీ కలువు..నువ్వు ఎవరి గురించి అయితే ఆరాటపడుతున్నావో వాళ్లతో కలసి ముందుకు సాగితే నువ్వు వాళ్లు హ్యాపీగా ఉంటారు
అనుపమ: వాళ్ల ముందు నిలకడగా ఉండలేను..అందుకే వెళ్లలేను
పెద్దమ్మ: ఇప్పుడు మాత్రం నిలకడగా ఉండగలుగుతున్నావా..ఇది నీ లైఫ్..పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి..ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నువ్వు పోగొట్టుకున్నది పొందేందుకు ప్రయత్నించు..కోల్పోయిన జీవితాన్ని ఎలాగూ పొందలేవు, కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నించు. మొన్నటి వరకూ నువ్వు స్థిరంగా ఆలోచించావు..కానీ మహేంద్ర నిన్ను కలసి వెళ్లినప్పటి నుంచీ నువ్వు నువ్వులా ఉండలేకపోతున్నావు..నీకు ఏమవుతుందో ఆలోచిస్తుంటే భయం వేస్తోంది...ఓ అడుగు ముందుకు వేసేందుకే ప్రయత్నించు...ఇక్కడే ఆగిపోకమ్మా
పెద్దమ్మ మాటలు విని అనుపమ ఆలోచనలో పడుతుంది...మహేంద్రతో మాట్లాడి తన దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడే కాల్ చేస్తాను అనుకుంటుంది అనుపమ...

Also Read: రిషిధార ఏకాంతాన్ని చెడగొట్టిన దేవయాని, అనుపమను హత్యకు శైలేంద్ర కుట్ర

మహేంద్ర, రిషి, వసుధార భోజనం చేస్తుంటారు..మహేంద్ర కొసరి కొసరి వడ్డిస్తాడు. తండ్రిలో మార్పు చూసి రిషి సంతోషిస్తాడు. ఇంతలో అనుపమ కాల్ చేస్తుంటుంది..మహేంద్ర కావాలనే కట్ చేస్తాడు..అనుపమ మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంటుంది... రిషి కూడా మాట్లాడండి డాడ్ అన్నప్పటికీ ఇదేం ఇంపార్టెంట్ కాల్ కాదని కట్ చేసి ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. అనుపమ బాధపడుతుంది.. వసుధార-రిషి ఇద్దరూ ఆలోచనలో పడతారు..మహేంద్ర మాత్రం భోజనం దగ్గర్నుంచి లేచి వెళ్లిపోతాడు..
రిషి: ఫోన్ రాకముందు బాగానే ఉన్నారు కానీ ఫోన్ వచ్చాక కంగారు పడుతున్నారెందుకు..అనుపమ అని వచ్చింది..అంటే అరకులో కలసిన ఆమె కదా..ఆమె ఎందుకు డాడ్ కి కాల్ చేశారు, డాడ్ ఎందుకు కట్ చేశారు..మనం ముందుగా అనుకున్నట్టుగా ఇద్దరికీ పరిచయం ఉందా..ఉంటే మనకెందుకు డాడ్ చెప్పడం లేదు..డాడ్ ని ఆవిడ గురించి అడిగితే బావోదు..
వసు: ఆవిడ నంబర్ తీసుకుని ఆమెకి కాల్ చేసి విషయం ఏంటో తెలుసుకోవాలా
రిషి: మనం కాల్ చేసి డాడ్ గురించి అడిగితే ఆమె ఫీలవుతుంది..ఆ విషయం తెలిస్తే డాడ్ హర్టవుతారు..అందుకే డాడ్ చెప్పేవరకూ వెయిట్ చేద్దాం
వసు: అసలు ఏం జరిగిందనేది మనకు తెలియదు కదా..వాళ్ల మధ్య గతం ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
రిషి: తర్వాత ఆలోచిద్దాంలే..ముందు భోజనం చేయి అంటాడు

Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి

సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న మహేంద్రకు వసుధార కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రిషి ఏం చేస్తున్నాడని అడిగితే..వాళ్ల పెద్దమ్మను కలిసేందుకు వెళుతున్నారని చెబుతుంది
మహేంద్ర: వాళ్లని చూస్తుంటేనే భయం వేస్తోంది..జగతి చావుకి కారణం ఎవరో తెలియకపోవచ్చు కానీ జగతి మనమధ్య లేదంటే కారణం వాళ్లే కదా.. శైలేంద్ర మన కుటుంబాన్ని చెల్లా చెదురు చేశాడు, రిషి వెళ్లిపోయిన తర్వాత కూడా జగతిని బెదిరించినా ఆమె తొణకలేదు.. రిషిని వాళ్లు ఎప్పుడు ఏం చేస్తారో అనే భయంగా ఉందమ్మా..
వసు: సర్ ని వాళ్లు ఏమీ చేయలేరు..
మహేంద్ర: వాళ్లు చేసిన నేరాలు ఘోరాలు మనకు తెలిసినా చెప్పలేకపోతున్నాం..
వసు: సర్ అక్కడికి వెళితేనైనా వాళ్లగురించి నిజం తెలుస్తుందని ఆశ
మహేంద్ర: ప్రమాదాలు సృష్టించినప్పుడు వాళ్ల మధ్యే ఉన్నాడు..అప్పుడే గుర్తించలేదు ఇప్పుడేం గుర్తిస్తాడు
వసు: సర్ కి వాళ్లపై అనుమానం లేదు కాబట్టి తెలియలేదు.. కానీ రిషి సార్ నిజం తెలుసుకునే సమయం వచ్చింది. కచ్చితంగా నేరస్తులు ఎవరనేది రిషి సర్ కి తెలుస్తుంది...
మహేంద్ర: వాళ్ల నిజస్వరూపాలు రిషి తెలుసుకోవాలి..ఆ దుర్మార్గుడిని ఎలా శిక్షిస్తాడో చూడాలి..వాళ్ల పతనం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను, నా కొడుకు చేతిలో వాళ్లకి నరకం కనిపించాలి..వాడు వేసే శిక్ష చూస్తే ఏ ఒక్కరికీ తప్పు చేయాలనే ఆలోచన రాకూడదు వాళ్లని దండించాలి..నాకు ఎవరిపైనా పగ, ప్రతీకారాలు లేవు కానీ పదవికోసం ఇన్ని ఘోరాలు చేసిన వాళ్లకి సరైన శిక్ష వేయాలి
వసు: సర్ కి అసలు నిజం తెలిసిన మరుక్షణమే వాళ్లకి సరైన శిక్ష వేస్తారంటుంది
ఇంతలో రిషి వచ్చి నేను పెద్దమ్మ దగ్గరకు వెళ్లొస్తానంటాడు
వసు: నేను కూడా మీతో పాటూ వస్తానంటుంది...
మావయ్య గారి గురించి భయపడొద్దు..జాగ్రత్తగానే ఉంటారని చెబుతుంది.. మనం వెళ్లాక మనసు మార్చుకుని ఆయన తాగుతారు అనుకుంటున్నారా అలా ఏం జరగదు..ఎందుకంటే మీరు మావయ్యకి ఇష్టంలేని పని చేయనని చెప్పారు కాబట్టి ఆయన మనకోసం నార్మల్ గా ఉంటారని చెబుతుంది. మహేంద్ర సరే అంటాడు.. వాళ్లిద్దరూ వెళతారు... 

Also Read: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త, నవంబరు 2 రాశిఫలాలు

రిషి వచ్చినట్టున్నాడు ఇక మన నటన ప్రదర్శించాలి అనుకుంటుంది దేవయాని.. ఇద్దరూ లోపలకు వెళుతుంటారు..కార్లో పర్స్ మర్చిపోయాను తీసుకొస్తానని వసుధార వెనక్కు వెళుతుంది.. రిషి లోపలకు వెళ్లగానే దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది.
దేవయాని: ఈ పెదమ్మ వంట లేకపోయేసరికి ఎలా చిక్కిపోయావో, మహేంద్ర ఎలా ఉన్నాడు బావున్నాడా అని అతి చేస్తుంటుంది
రిషి: డాడ్ రాలేదని క్లారిటీ ఇస్తాడు.. ఆయన రావాలి అనుకోలేదు..
దేవయాని: నేనింకా తను వచ్చాడేమో క్షమాపణలు అడుగుదాం అనుకున్నాను కనీసం వసుధార అయినా వచ్చి ఉంటే బావుండేది కదా
నేను వచ్చాను మేడం అంటూ ఎంట్రీ ఇస్తుంది వసుధార..
వసు: నా గురించి మీరు మరీ ఎక్కువ బాధపడుతున్నారు..పాపం ఎంత దిగులు పెట్టుకున్నారో ఏంటో..రాననుకున్నారా రాలేను అనుకున్నారా
ఇంతలో శైలేంద్ర వచ్చి పలకరిస్తాడు..బాబాయ్ లేడేంటని అడిగుతాడు... ఫణీంద్ర కూడా వచ్చి పలకరిస్తాడు...వస్తున్నట్టు చెప్పలేదేంటని అడిగితే పెద్దమ్మకు చెప్పానంటాడు... మీ పెద్దమ్మ అలాంటివి చెప్పదులే అని కౌంటర్ వేస్తాడు
దేవయాని: ఏం తింటావు 
ఫణీంద్ర: ముందు నువ్వు రిషి బుర్ర తినడం ఆపేసెయ్...
రిషి: పెదన్నాన్నా మీకు ఓ వ్యక్తిని పరిచయం చేయాలని చెప్పి కాల్ చేసి పిలిపిస్తాడు...
ముకుల్ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది...
రిషి: అమ్మ కేసుని డీల్ చేయడానికి స్పెషల్ గా అపాయింట్ అయిన ఆఫీసర్ అని తన పెదనాన్నకి పరిచయం చేస్తాడు. అసలు ఈ ఇంటి మీద నిఘా వేసినవారెవరో అర్థం కావడం లేదు..మనం ఉండేది ఆరుగులు, ఏడుగురం అయినా ఏదో జరుగుతోంది. ఆ రోజు అమ్మ ఇంట్లోంచి బయలుదేరడం నాకు, అమ్మకు మాత్రమే తెలుసు..మరి జగతి మేడం బయటకు వచ్చినట్టు ఎలా తెలిసిందో
ముకుల్: జగతి మేడం ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నా తెలుస్తుంది కదా
వసు: నిజమే సర్..ముందు మనం మన చుట్టుపక్కలవారిని, మనం అనుకున్నవాళ్లని ఇన్వెస్టిగేషన్ చేయడం మంచిదేమో...
శైలేంద్ర-దేవయాని షాక్ అయి చూస్తుంటారు....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget