Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త, నవంబరు 2 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
2023 నవంబరు 02 గురువారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినవచ్చు. ప్రతికూల ఆలోచనలు వదిలించుకోవడం మంచిది. వ్యాపారంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి. మీరు చేపట్టే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. గోప్యమైన విషయాలను బయటపెట్టవద్దు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన చెస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీరు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీరు కార్యాలయంలో మీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ మాటతీరు మీకు గౌరవాన్ని తెస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అలసత్వం వహించకండి. ప్రమాదకర విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. గౌరవం పెరుగుతుంది. మీ సన్నిహితుల నమ్మకాన్ని సులభంగా గెలుచుకోగలుగుతారు. ఖర్చులపై నియంత్రణను కొనసాగించండి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. మీరు కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
కర్కాటక రాశి
ఈ రోజు పెట్టుబడి పరంగా మంచి రోజు. మీరు మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వ్యాపార విషయాలలో జాప్యం చేయవద్దు. ఆలోచనాత్మకంగా సంతకం చేయండి. లావాదేవీ ప్రయత్నాలు బాగుంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
సింహ రాశి
ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం పుంజుకోవడంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. పోటీ భావన మీ మనసులో నిలిచిపోతుంది. ఉద్యోగులకు ఇది మంచి సమయం. ఆర్థిక ఇబ్బందులు తీరుపోతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు సన్నిహితుల నుంచి మద్దకు పెరుగుతుంది. అనుకున్న ధనం కన్నా ఎక్కువ చేతికందుతుంది. కోర్టు వ్యవహారాల్లో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మీ హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు. మీరు ఏదైనా కొత్త పనిని ఆలోచనాత్మకంగా ప్రారంభించాలి.
Also Read: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!
తులా రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు లాభపడతారు. అనుకున్న పనులకు అడ్డంకులు ఎదురైనా కానీ పూర్తవుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మీరు మారడం మంచిది. కొత్త విషయాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. వ్యాపార ప్రణాళికలను పునఃప్రారంభించవచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో ఒత్తిడికి గురవుతారు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టొచ్చు. కుటుంబంలో పెద్దల నుంచి మంచి సలహాలు పొందుతారు. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవ్వరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. ఎవరైనా సలహా ఇస్తే చాలా ఆలోచనాత్మకంగా అమలు చేయండి.పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అధిక పని అలసట కలిగిస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దాంపత్య జీవితంలో సామరస్యం ఉంటుంది. ఎవరితోనైనా గొడవలు జరిగితే అవి సద్దుమణుగుతాయి. మీరు కొన్ని ముఖ్యమైన పనులపై పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. భూమి లేదా భవనానికి సంబంధించిన విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
Also Read: ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…
మకర రాశి
ఈ రాశివారు కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. లావాదేవీల విషయంలో స్పష్టత ఉండాలి. వ్యాపార సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అందరినీ వెంట తీసుకెళ్లడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థుల్లో కొందరు మీ పనిలో అడ్డంకులు సృష్టించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.
కుంభ రాశి
ఈరోజు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. కుటుంబ పరిస్థితులను నియంత్రించవలసి ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం ఉంటుంది. మరొకరిని నమ్మి ఏ పనిని వాయిదా వేయకూడదు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు చెప్పేది విని అర్థం చేసుకోండి. నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఒత్తిడి తగ్గుతుంది.
మీన రాశి
కుటుంబంలో శుభకార్య నిర్వహణపై చర్చిస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఎవ్వరితోనూ వాదనకు దిగొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సన్నిహితుల సూచనలు మీకు మంచి చేస్తాయి.