News
News
X

Zodiac Signs: ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…

వ్యక్తిత్వాన్ని, మనసుని చూసి ఇష్టపడేవారు కొందరు…అందానికి ఆకర్షితులై ప్రేమలో పడేవారు మరికొందరు. కానీ కొన్ని రాశుల వారు మాత్రం డబ్బు-హోదా చూసి ప్రేమలో పడతారట. ధనం మూలం ఇదం జగత్ అని వీళ్ల భావన అన్నమాట.

FOLLOW US: 
 
సాధారణంగా ఎలాంటి లక్షణాలున్నవారు నచ్చుతాయని అడిగితే కామన్ గా ఏం చెబుతారు…అబ్బాయిలైతే అందం, అణకువ, మంచి చదువు, తన కుటుంబంలో కలసిపోయే అమ్మాయి కావాలంటారు. అమ్మాయిలైతే… అందగాడు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం అని చెబుతారు. ఇంకా ఒక్కొక్కరి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఇక ప్రేమలో పడిన వారైతే కేవలం మనసుకి నచ్చిన వారు తోడుగా ఉంటే చాలు మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని రాశులవారు మాత్రం హోదా చూసి ప్రేమలో పడతారట. డబ్బు అనగానే కొందరిగుండె కాస్త లబ్-డబ్బు అని గట్టిగా కొట్టుకుంటుందట.

వృషభం

వృషభం రాశివారిలో 90శాతం మంది లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారట. జీవితంలో ఎప్పుడూ సానుకూల ఫలితాలు ఉండాలని కోరుకుంటారు. అందుకే అనుకోకుండానే డబ్బుకు ప్రాధాన్యమిస్తారు. డబ్బు కోసం ప్రేమలో పడతారు. అయితే ఈ రాశివారిలో కొందరు తమ రొమాంటిక్ జీవితానికి డబ్బు అడ్డుగా అనిపిస్తే మాత్రం కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు మొగ్గుచూపుతారు.

News Reels

సింహరాశి

సింహం ఎప్పుడు రాజాలా బతకాలని అనుకుంటుంది. అవే లక్షణాలు ఈ రాశివారికి కూడా ఉంటాయి. ఈ రాశిలో కొందరు రిస్క్ లేకుండా నిజమైన ప్రేమ కోసం పరితపిస్తుంటారు….అదే సమయంలో లగ్జరీ లైఫ్, విందులు, వినోదాలు, బహుమతుల్లో మునిగితేలాలని అనుకుంటారు. అందుకే వీరికి తెలియకుండానే డబ్బుకి ఎక్కువ విలువనిస్తారు.
వృశ్చికం

వృశ్చికరాశివారు తమని తాము ఉన్నత స్థానంలో చూసుకునేందుకు ఇష్టపడతారు. వీరిలో ఉండే పోటీతత్వం అగ్రస్థానంలో ఉంచుతుంది. లగ్జరీ లైఫ్‌ను కోరుకునే రాశుల్లో ఇదొకటి. ఈ రాశివారు తమ విషయాలను చాలా గుట్టుగా ఉంచుతారు. తమని ప్రేమించేవాళ్లను ఎంతో ఇష్టపడతారు.  బహుమతులు గెలుచుకోవడం- పొందడం వీరికి ఎక్కువ సంతోషాన్నిస్తుంది.

ధనుస్సు

ఈ రాశి వారు థ్రిల్, అడ్వెంచర్లకు త్వరగా ఆకర్షితులవుతారు. ఫలితంగా తమ లక్ష్యాలు సాధించడానికి, తమ జీవితాన్ని గొప్పగా మలుచుకునేందుకు అనుకోకుండానే డబ్బు ప్రేమలో పడిపోతారు. కొత్త ప్రాంతాలను, సరికొత్త వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారట. ఈ అభిరుచులు కూడా వారిని డబ్బు కోసం ప్రేమలో పడేలా చేస్తాయట. డబ్బు చూసి ముందడుగేసినా స్వచ్ఛమైన ప్రేమని కూడా అందిస్తారట.

మకరం

మకర రాశివారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. పగటి కలలు కంటూ కూర్చోవడం కాదు…వాటిని నిజం చేసుకోవడానికి విశ్రాంతి లేకుండా శ్రమస్తారు. వీరికి ముందు చూపు కూడా ఎక్కువే.  ప్రేమలో పడినా, భాగస్వామిని ఎంపిక చేసుకున్నా డబ్బు కలిసొస్తుందా లేదా అని కూడా ఆలోచిస్తారట.

గమనిక: ప్రేమను డబ్బుతో ముడిపెడతారా అని అడగొచ్చు..కానీ కొందరి ఆలోచనలు అలాగే ఉంటాయి. అలాగని ఈ రాశుల్లో ఉన్న నక్షత్రాలకు చెందిన వారంతా ఇలాగే ఉంటారని భావించవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన మనసుతో ప్రేమించే వారూ ఉంటారు. వారు పెరిగిన వాతావరణం, వ్యక్తిత్వం బట్టి ఆలోచనల్లో మార్పులు ఉండొచ్చు…

Published at : 11 Aug 2021 09:32 AM (IST) Tags: zodiac signs these constellations revolve around money fall in love with people Money mind

సంబంధిత కథనాలు

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

టాప్ స్టోరీస్

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Telangana Congress Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు - కలెక్టరేట్ల ముందు ధర్నాలు

Telangana Congress Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు - కలెక్టరేట్ల ముందు ధర్నాలు

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

Jabardast Pavithraa: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!

Jabardast Pavithraa: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!