Guppedantha Manasu November 1st Episode: రిషిధార ఏకాంతాన్ని చెడగొట్టిన దేవయాని, అనుపమను హత్యకు శైలేంద్ర కుట్ర
Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు నవంబరు 1 ఎపిసోడ్
వసుధారకు ఇంటి పనుల్లో సాయం చేస్తానంటూ వచ్చిన రిషిని వద్దంటుంది వసుధార. ఆ తర్వాత బట్టలు మడతపెడుతూ కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఇల్లంతా పరుగులు తీస్తుంటే వాళ్లని చూసి మహేంద్ర సంతోషిస్తాడు.
రిషి-వసుధార
కష్టపడి వసుధారను పట్టుకున్న రిషి..ఎప్పటికైనా దొరకాల్సిందే అని రిషి అంటే..మీకు దొరకడానికే నేను ఉన్నానని రొమాంటిక్‌గా వసుధార బదులిస్తుంది. మరి పారిపోవడం ఎందుకని రిషి అడిగితే వెంటనే దొరికితే అందులో కిక్ ఉండదని ఆన్సరిస్తుంది. కావాలనుకున్నదాని కోసం కష్టపడాలి, ప్రయాసపడాలి అంటాడు రిషి. ఈ క్షణం నీకు ఏమనిపిస్తోందని రిషి అంటే..ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనని రిప్లై ఇస్తుంది. వసు అందాన్ని పొగడడం మొదలెడతాడు. రిషి మాటలు వసు సిగ్గుపడుతుంటుంది.. ఇద్దరూ ప్రేమమైకంలో ఉండగా వారిని చెడగొడుతుంది దేవయాని ఫోన్ కాల్.
Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి
దేవయాని-రిషి
రిషికి ఫోన్ చేసి యాక్టింగ్ మొదలుపెడుతుంది దేవయాని. నేను పరాయి దానిని అయిపోయానా, ఇంటికి రా అని డ్రామా మొదలెడుతుంది. మిమ్మల్నే తలచుకుంటూ బతుకుతున్నానని, నువ్వు లేకుండా ఇంట్లో అసలు ఉండలేకపోతున్నానంటూ ఎమోషనల్ అవుతుంది. ముద్ద కూడా తిగడం లేదని లేని బాధ ప్రదర్శిస్తుంది. తప్పు జరిగి ఉంటే క్షమించమని, నువ్వు ఇంట్లో నుంచి వెళుతూ లగేజీతో పాటు పెద్దమ్మ సంతోషాన్ని కూడా తీసుకుపోయామని ఎమోషనల్ అవుతున్నట్లుగా నటిస్తూ రిషిని నమ్మిస్తుంది. మీరు నా గురించి అంతలా ఆలోచించడానికి నేనే పసిపిల్లాడిని కాదన్న రిషి మీ ప్రేమ నాకు కావాలి..అక్కడి వస్తానని చెబుతాడు. అయితే అమ్మను చంపిన హంతకుడు ఎవరో కనిపెట్టాలి. వాళ్లు ఎవరో తెలుసుకోవడానికి తాను చేసే ప్రయత్నాలు విఫలం కాకూడదని అంటాడు. అప్పటివరకు నువ్వు నా దగ్గరికి రావా...అప్పటిలోగా ఈ పెద్దమ్మ ప్రాణాలతో ఉండలేదని మరింత ఆజ్యం పోస్తుంది. నువ్వు ఇంటికి వచ్చే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటుంది. దేవయాని ప్రేమకు రిషి కరిగిపోతాడు. త్వరలోనే వస్తానని దేవయానికి మాటిస్తాడు.
అక్టోబర్ 28 ఎపిసోడ్: అరకు లోయల్లో రిషిధార రొమాంటిక్ జర్నీ, శైలేంద్రకి బిగ్ షాక్!
మహేంద్ర-రిషి
దేవయానితో రిషి మాట్లాడిన మాటల్ని మహేంద్ర వింటాడు. అక్కడకు వెళుతున్నావా...వెళుతున్నామా అని రిషితో అంటాడు మహేంద్ర. మీరు మాట పడ్డ చోటుకి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తానని, ఏ ఇంట్లో అయితే మీరు అవమానపడ్డారో ఆ ఇంట్లో మిమ్మల్ని నిలబెట్టి అందరికి సంజాయిషీ చెప్పుకోలేనని అంటాడు రిషి. నేను ఒక్కడినే వెళ్తానని బదులిస్తాడు. రిషి ఇచ్చిన సమాధానంతో మహేంద్ర పొంగిపోతాడు. మీ సంతోషం కోసం, మీ గౌరవం నిలబెట్టడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని మహేంద్రకు మాటిస్తాడు రిషి. అమ్మను చంపినవారెవరో తెలుసుకునేందుకు నేను ప్రయత్నాలు చేస్తున్నాను...అందుకు సహకారం కావాలని అడుగుతాడు. నీకు తల్లి ప్రేమను, నాకు భార్య అనురాగాన్ని దూరం చేసిన ఆ వెధవల్ని క్షమించే ప్రసక్తే లేదని మహేంద్ర ఆవేశంగా చెబుతాడు. ఒకవేళ ఆ శత్రువుల్ని క్షమించాల్సివస్తే అని రిషిని అడుగుతుంది వసుధార. అది పిచ్చి ప్రశ్న అని రిషి బదులిస్తాడు. ఈ విషయం తండ్రి మాటే తన మాట అని, అమ్మను చంపిన వారిని క్షమించే ప్రసక్తే లేదని చెబుతాడు.
దేవయాని -శైలేంద్ర
నువ్వు మహానటివి, నీ ప్రేమ నిజమనుకుని రిషి నమ్మాడని, ఇంటికి తిరిగి వస్తానని అన్నాడని శైలేంద్ర అంటాడు. నీనటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అని దేవయానిపై శైలేంద్ర ప్రశంసలు కురిపిస్తాడు. మహేంద్ర, వసుధారలతో కలిసి రిషి త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాడని, అప్పుడు వారి కదలికల్ని కనిపెట్టి కాలేజీని తన సొంతం చేసుకుంటానని శైలేంద్ర అంటాడు. మరోవైపు అనుపమను గుర్తుచేసుకుని దేవయాని భయపడుతుంది. అనుపమకు నిజాలు తెలిస్తే తప్పకుండా తను ఇక్కడికి వస్తుంది, అదే జరిగితే మనం అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాదని శేలేంద్రతో అంటుంది. జగతినే చంపినవాడికి అనుపమ ఎంత అంటూ శైలేంద్ర తనలో క్రూరత్వాన్ని బయటపెడతాడు.
మహేంద్ర జ్ఞాపకాల్లో అనుపమ
మహేంద్ర జ్ఞాపకాల్లో మునిగిపోతుంది అనుపమ. అప్పుడే అక్కడికి పెద్దమ్మ వస్తుంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉందని అంటుంది. పెదమ్మ మాటలతో అనుపమ షాక్ అవుతుంది. నీ మనసును గత జ్ఞాపకాలు కలిచివేస్తున్నాయని నాకు తెలుసు, ఇంకా ఎలా ఎన్నాళ్లు ఉంటావని అనుపమను అడుగుతుంది. నా చివరి శ్వాస వరకు అని పెద్దమ్మకు బదులిస్తుంది అనుపమ. మనుషుల్ని వదులుకున్నంత ఈజీగా జ్ఞాపకాల్ని వదులుకోలేమని అంటుంది. నా గతం నుంచి బయటకు రాలేకపోతున్నానని, నా జీవితం అక్కడే ఆగిపోయిందని అనుపమ అంటుంది. మహేంద్ర, జగతికి దూరమై చాలా కాలమైన, వారితో గడిపిన క్షణాల్ని మర్చిపోలేకపోతున్నానని అనుపమ ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఆ గతంలోకి మళ్లీ వెళ్లాలనని, మళ్లీ జగతి, మహేంద్ర దగ్గరకు వెళితేనే నీకు మంచిదని అనుపమకు సలహా ఇస్తుంది పెద్దమ్మ. ..