Karthika Deepam September 9th Update: శౌర్యని చూసి ఆగిన కార్తీక్, మోనితని టెన్షన్లో పడేసిన దీప!
Karthika Deepam September 9th Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 9th Episode 1453 (కార్తీకదీపం సెప్టెంబరు 9 ఎపిసోడ్)
దీపని ఇంట్లో చూసి ఫైర్ అవుతుంది మోనిత. అసలు తను లేకపోతనే ఈ రోజు ఇంటికి వచ్చేవాడిని కాదంటాడు. ఏమైందని మోనిత అడగడంతో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్..కానీ..గుర్తుండదు. అప్పుడు దీపని చెప్పమంటాడు. దీప, ఇందాకే జరిగింది కదా డాక్టర్ బాబు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని అంటుంది. కార్తీక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దీప చెబుతుంది. మోనితని వదిలేసి వెళ్లిన కార్తీక్ దారి మర్చిపోయి అందర్నీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు దీపని చూసి సంతోషపడతాడు. నువ్వొచ్చావ్ కదా దారి చూపించు అని చేయిపట్టుకుని తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతాడు. ముందు మా అన్నయ్య వాళ్లింటికి వెళదాం అని అడిగితే..వద్దు మోనిత కంగారుపడుతుంది ఇంటికే తీసుకెళ్లమంటాడు.
కార్తీక్: ఈ విషయం మొత్తం చెప్పి..అసలు వంటలక్కే లేకపోతే ఏమయ్యేవాడినో. నేను రాకపోయి ఉంటే నువ్వు ఈ పాటికి రోడ్డున పడి వెతుక్కునేదానివి. తనకి ఏం ఇచ్చినా తక్కువే
దీప: అలా అనకండి డాక్టర్ బాబు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత
మోనిత: నీ బాధ్యత ఏంటి నీ బాధ్యత...
కార్తీక్: ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పకుండా తిడతావేంటి..ముందు సోరీ చెప్పు అంటాడు..
మోనిత: అనవసరంగా నీపై కోప్పడ్డాను కానీ మా ఆయన చెబితే అర్థమైంది నువ్వు ఎంత సహాయం చేశావో..నువ్వే రాకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో...అంటూ మా ఆయన అని పదే పదే అంటుంది. దీపని హగ్ చేసుకుని ఓవరాక్షన్ చేస్తుంది. నువ్వు ఎప్పటికైనా మా ఆయన్ని తీసుకొచ్చి నాకు అప్పగించాల్సిందే.
దీప: మా ఆయన మీ ఆయన ఎప్పటికీ అయిపోరు..ఒకప్పుడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నావ్ ఏమైంది... కాలచక్రం మళ్లీ మా ఆయన్ని నా దగ్గరకు చేరుస్తుంది...
వీళ్లిద్దర్నీ చూసి కార్తీక్..ఇలా ఉండాలి..మనిషిని అర్థం చేసుకుంటే ఎంత బావుంటుందో అంటాడు..
దీప వెళ్లిపోతూ...రేపు వినాయకచవితి పూజ చేస్తున్నాను మీరు తప్పకుండా రావాలని చెప్పేసి వెళ్లిపోతుంది..
Also Read: మోనిత తలనొప్పి - దీప బామ్, గతాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నంలో డాక్టర్ బాబు
వినాయకుడి బొమ్మలు అమ్మేందుకు వరుసగా పేరుస్తుంది.నీకెందుకమ్మా ఈ పనులన్నీ చిన్నపిల్లవి అని ఇంద్రుడు-చంద్రమ్మ అంటే.. మా అమ్మ కూడా ఇలాగే అనేదని గుర్తుచేసుకుని ఎమోషన్ అవుతుంది. నాకు ఊసుపోవడం లేదు..ఇలా ఏదో పనిమీద బయటకు వెళితేనే కదా అమ్మా-నాన్న కనిపిస్తారేమో అంటుంది. వారణాసి అమ్ముతుంటే నేను డబ్బులు తీసుకుంటానంటుంది.
వినాయకచవితి పూజకి రమ్మని దీప పిలిచిన విషయం గుర్తుచేసుకుని ఇరిటేట్ అవుతుంది. ఏదో సాయం చేస్తే తలపట్టుకునేంత చనువు ఇస్తారా ఎవరైనా.. కార్తీక్ దీపతో నాకన్నా ఎక్కువ చనువుగా ఉంటున్నాడు. వినాయక చవితికి రమ్మంది అంటే ఏదో ప్లాన్ చేసే ఉంటుంది, కార్తీక్ కి గతం గుర్తురావాలంటే ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ రావడంత..రేపు వంటలక్క పూజకి రమ్మని పిలిచింది కదా నువ్వు వెళ్లొద్దు అంటుంది
కార్తీక్: ఆ విషయమే మర్చిపోయాను..నన్ను రమ్మంది కదా వెళతాను
మోనిత: నువ్వు వంటలక్క దగ్గరకు వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు..వెళ్లొద్దు అన్నాకదా నాకోసం వెళ్లకుండా ఉండలేవా
కార్తీక్: సరే నేను వెళ్లను..వంటలక్కనే ఇక్కడకు రమ్మందాం..అందరం కలసి ఇక్కడే పూజ చేసుకుందాం...నేను అక్కడకు వెళ్లడం నీకు ఇష్టం లేదంటే తనే అక్కడకు వస్తుంది..
మోనిత: ఎంత వదిలించుకుందామన్నా జిడ్డులా తయారైంది..కార్తీక్ ని అక్కడకు పంపించడం కన్నా దాన్ని ఇక్కడకు రమ్మనడం బెటర్ అనుకుంటుంది. ఇక్కడకు రమ్మందాం అని కార్తీక్ కి చెబుతుంది
కార్తీక్: నేను వెళ్లి చెప్పి వస్తాను
మోనిత: అవసరంలేదు..పూజలకు వ్రతాలకు ఆడవాళ్లు వెళ్లి పిలవాలని చెబుతుంది... కార్తీక్ లోపలకు వెళ్లిపోగానే మోనిత ఆవేశంతో ఊగిపోతుంది...ఎంతకైనా తెగిస్తాను కానీ కార్తీక్ ని నీకు దక్కనివ్వను అనుకుంటుంది..
Also Read: దేవయాని ప్లాన్ రివర్స్ - రిషిని ఆలోచనలో పడేసిన జగతి మాటలు, సంబరం చేద్దామన్న వసు
దీప ఇంకా రాలేదేంటని డాక్టర్ వాళ్లమ్మ ఆలోచిస్తూ ఉండగా..దీప వస్తుంది.
డాక్టర్ అమ్మ: వచ్చావా..ఆ రాక్షసి ఎప్పుడు ఏం చేస్తుందో అని భయపడుతున్నా
దీప: దారి మరిచిపోయిన కార్తీక్ ని ఇంటికి తీసుకెళ్లిన విషయం చెబుతుంది
డాక్టర్ అమ్మ: దారి మరిచిపోయినప్పుడు తీసుకెళ్లాల్సింది మోనిత ఇంటికి కాదు..నీ ఇంటికి..
దీప: డాక్టర్ బాబు తనకి తానుగా నా దగ్గరకు రావాలి
డాక్టర్ అన్నయ్య: నువ్వు అనుకున్నది త్వరలోనే అవుతుంది..
డాక్టర్ అమ్మ: నీకు అసలు విషయం తెలియదంటూ..జరిగినదంతా చెబుతుంది డాక్టర్ తల్లి..
డాక్టర్ అన్నయ్య: దీప మంచిపని చేసిందమ్మా అంటాడు..
ఎపిసోడ్ ముగిసింది..
రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
ఇంటికి తోరణాలు కడుతుంటే.. రేపు వినాయక చవితి కదా మా ఇంటికి రా అనిదీప పిలుస్తుంది... ఆ తర్వాత మోనిత,కార్తీక్ బయటకు వెళతారు..వినాయక బొమ్మలు అమ్ముతున్న శౌర్యని చూసి కారు ఆపుతాడు కార్తీక్...