Karthika Deepam September 8th Update: మోనిత తలనొప్పి - దీప బామ్, గతాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నంలో డాక్టర్ బాబు
Karthika Deepam September 8th Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 8th Episode 1452 (కార్తీకదీపం సెప్టెంబరు 8 ఎపిసోడ్)
గుడిలో ప్రమాణం చేసిన దీప..మోనితకు సవాల్ విసురుతుంది. కార్తీక్ కూడా దీపని సపోర్ట్ చేస్తాడు. తను తప్పుచేయలేదని ప్రమాణం చేసిందికదా..నువ్వుకూడా తప్పు చేయకపోతే ప్రమాణం చేయమని కార్తీక్ కూడా అంటాడు. నేను ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు...అయినా నేనెందుకు ప్రమాణం చేయాలి కార్తీక్ నా భర్త అని బలవంతంగా కార్తీక్ ని లాక్కెళ్లిపోతుంది. అదే గుడికి వచ్చిన వారణాసి, శౌర్య ఇంటికెళ్లిపోతారు...
ఆ తర్వాత కార్లో వెళుతుండగా..మోనిత ఆలోచనలో పడుతుంది. మొన్న ఆంటీ అంకుల్ కనిపించారు. నిన్న దీప, ఈరోజు శౌర్య అందరూ ఇక్కడే ఉన్నారు. కార్తీక్ లేడని బాధతో అందరూ కుమిలి కుమిలి ఏడుస్తారు అనుకుంటే అందరూ ఇక్కడే ఉన్నారు. దీపా,కార్తీక్ బతికి ఉన్నారని వాళ్లకు తెలుసా.ఆంటీ కి కార్తీక్ నా దగ్గర ఉన్నాడని తెలిస్తే, నాలుగు తగిలించి కొడుకు అని లాక్కెళ్ళిపోతారు...నా పవిత్రమైన ప్రేమకి ఇన్ని పరీక్షలేంటి స్వామీ అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఆలోచననుంచి బయటపడిన మోనిత..మనిల్లు అటువైపు కదా ఇటు వెళుతున్నావేంటంటుంది. నాకు గుర్తులేదుకదా నువ్వు అలెర్ట్ గా ఉండాలికదా అంటాడు.
కార్తీక్: వంటలక్క అబద్ధం చెప్పకపోయి ఉంటే తను ప్రమాణం చేసేది కాదు కదా..
మోనిత: ఈ టాపిక్ ఇంతటితో ఆపుతావా
కార్తీక్: నేను వంటలక్కతో మాట్లాడకూడదని ప్రమాణం చేయమని తీసుకెళ్లావ్...తను తప్పుచేయలేదని ప్రమాణం చేసింది.. నువ్వు కూడా తప్పు చేయకపోతే ప్రమాణం చేయొచ్చు కదా
మోనిత: కోపంగా కారు దిగిన మోనిత..అది ప్రమాణం చేస్తే నేను చేయాలా..నీకు ఆవిడ-నేను ఒక్కటేనా...నువ్వు నన్ను నమ్మాలంటే ప్రమాణం చేయాలా
కార్తీక్: ప్రమాణం చేస్తే నిజమని అనిపించేది కదా
మోనిత: ఈ క్షణం నుంచి వంటలక్కని కలవనని మాటివ్వు
కార్తీక్: నన్ను ప్రతీదానికీ కమాండ్ చేస్తావేంటి..నా భార్యని అనుకుంటున్నావా టీచర్ ని అనుకుంటున్నావా... మాటిస్తే కానీ కదలను అంటున్నావ్ కదా..నువ్వు ఇక్కడే ఉండు నేను వెళతాను అని వెళ్లిపోతాడు.
రోడ్డుపైనే ఉండిపోతుంది మోనిత
Also Read: మోనితను నడిరోడ్డుపై వదిలేసి దీప దగ్గరకు వెళ్లిపోయిన కార్తీక్, మోనితకు పెద్ద షాకే ఇది!
శౌర్య-వారణాసి
వారణాసి,శౌర్య రోడ్డు పక్కన ఇడ్లీ తింటూ ఉంటారు. అప్పుడు వారణాసి సాంబారు చట్నీ కలిపి తింటున్నావ్ ఏంటమ్మా అయినా ఇదేనా నువ్వు ఇచ్చే పార్టీ అని అడిగితే..అమ్మ నాన్న వచ్చే వరకు నేను ఏ పుట్టినరోజు ఏ పండగలు జరుపుకోను అంటుంది. అమ్మా-నాన్న లేనివారని అనాధలని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాడు వారణాసి. అప్పుడు శౌర్య గతంలో కార్తీక్ కి సాంబార్ చట్నీ కలిపి ఇడ్లీ తినిపిస్తున్న సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది.
వారణాసి: అమ్మా నాన్న గుర్తొచ్చారా
శౌర్య: పుట్టినరోజు కదా ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నారు. చిన్నప్పుడు నేను అమ్మాయి ఇద్దరమే ఉండేవాళ్ళము నాన్న ఎవరో తెలీదు. తర్వాత నాన్న, నానమ్మ, తాతయ్య, అందరూ మధ్యలో వచ్చారు. అంతా బాగుండేది అందరం కలిసి బాగా గడిపే వాళ్ళం దాని తర్వాత మళ్లీ వాళ్లు వెళ్లిపోయారు.దేవుడు నా జీవితంలో ఒకేసారి ఉప్పెనంత ఆనందాన్ని ఇచ్చి లాగేసుకున్నాడు.
మోనిత డ్రామా అంతా డాక్టర్ వాళ్ల అమ్మకి చెబుతుంది దీప. నువ్వు ప్రమాణం చేశావు కదా..నీ తప్పు లేదని కార్తీక్ కి తెలిసింది..నువ్వు మళ్లీ అక్కడకు వెళ్లి నీ ప్రయత్నాలు నువ్వు చేయి అని చెబుతుంది డాక్టర్ తల్లి. ఆయన నాచేతి వంట తిని గతం గుర్తు చేసుకుంటారో అని ఏదో కలిపానని నాటకం ఆడింది...నా ప్రయత్నం ఆపను అమ్మా అని దీప అక్కడినుంచి వెళ్లిపోతుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మగారు డాక్టర్ తో..మోనితని మనం ఏం చేయలేమా అని అడుగుతుంది. కార్తీక్ గతం గుర్తు రాకుండా మొనితని మనం ఏమైనా చేస్తే జీవితాంతం మోనిత లేదని బాధపడుతూనే ఉంటాడు...దానికన్నా గతం గుర్తొస్తే మంచేదో చెడేదో తెలుసుకుంటే మంచిదని చెబుతాడు.
Aloso Read: రిషిధార రొమాంటిక్ డిన్నర్, కండిషన్స్ అప్లై అన్న ఈగో మాస్టర్
మోనిత మీద కోపంతో కారులో వచ్చేసిన కార్తీక్..ఇంటికెళ్లే దారి మర్చిపోతాడు. కారుదిగి బయట నిల్చుంటాడు. ఆ తర్వాత మోనిత ఎలాగోలా బొటిక్ చేరుకుంటుంది. లోపలకు ఎంట్రీ ఇచ్చేసరికి..కార్తీక్ నుదిటి మీద బామ్ రాస్తూ కనిపిస్తుంది దీప.
మోనిత: కోపంగా... దీన్ని తీసుకురావడానికా నన్ను రోడ్డుమీద వదిలేశావ్ .అయినా దీంతో మాట్లాడొద్దని చెప్పాను కదా కార్తీక్. మొన్న టిఫిన్ లో విషం కలిపింది నా ప్రాణాలు మీదకు వచ్చింది అయినా సరే మాట్లాడుతున్నావా
కార్తీక్: ప్రమాణం చేసింది కదా తన తప్పేం లేదని నేను నమ్ముతున్నాను ఎందుకు ప్రతిసారి వంటలక్క మీద పడుతున్నావు. అయినా ఈరోజు తను లేకపోతే నేను నీకు దక్కేవాడిని కాదు . ఏమైందని మొనిత అడగడంతో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్..కానీ..గుర్తుండదు. అప్పుడు దీపని చెప్పమంటాడు.
దీప: ఇందాకే జరిగింది కదా డాక్టర్ బాబు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని అంటుంది. కార్తీక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( శుక్రవారం ఎపిసోడ్ లో)
మా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అన్న మోనిత..ఎప్పటికైనా కార్తీక్ ని తీసుకొచ్చి నాకు అప్పగించాల్సిందే అంటుంది. కాలచక్రం తిరుగుతుంది నా డాక్టర్ బాబు నా దగ్గరకు వస్తాడంటుంది దీప...