అన్వేషించండి

Brahmamudi Serial Today march 11th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌కు వెంటనే ఆపరేషన్‌ చేయాలన్న డాక్టర్‌ - డబ్బులు కోసం పనిమనిషిగా మారిన ఇందు  

Brahmamudi serial today episode march 11th: సుభాష్‌ను చెక్‌ చేసిన డాక్టర్‌ వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  సుభాష్‌ను చెక్ చేసిన డాక్టర్‌ వెంటనే ఆపరేషన్‌ చేస్తే నడుస్తాడని లేదంటే వెన్నెముక పాడైపోతుందని ఇక ఎప్పటికీ నడవలేడని చెప్తాడు. దీంతో అపర్ణ, ఇందు షాక్‌ అవుతారు. 
అపర్ణ: ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్‌
డాక్టర్‌: ఆపరేషన్‌కు పది లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత అబ్జర్వేషన్‌ అని టెస్టులు అని హాస్పిటల్‌ లో కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది. మొత్తం మీద ఒక పదిహేను లక్షలు అవుతాయి 
అపర్ణ, ఇందు: పదిహేను లక్షలా..? 
డాక్టర్‌: అపరేషన్‌ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది లేదంటే వెన్నెముక పాడైపోతుంది. అంతవరకు ఈ మెడిసిన్స్‌ వాడండి 
అని చెప్పి డాక్డర్‌ వెళ్లిపోతాడు. 
అపర్ణ: కోటలో బతుకుతున్నా.. కోట్ల ఆస్థి కళ్ల ముందు కనిపిస్తున్నా..? మీకు ఆపరేషన్‌ చేయించడానికి ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు.. ఇప్పుడు అంత డబ్బంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి. వచ్చిన డబ్బును వచ్చినట్టే రాబందుల్లా వాళ్లు పీక్కుతింటున్నారు. ఇప్పుడు మనకు అవసరం అయితే అంత డబ్బు ఎవరిస్తారు 
ఇందు: ఇంకెవరు ఇస్తారు ఆ రేఖ ఆంటీ ఇస్తారు.. ఇప్పటి వరకు మన కోసం అంటూ ఎప్పుడూ ఏదీ అడగలేదు.. తాతయ్య కోసమైన ఆ రేఖ ఆంటీని అడుగుతాను నాన్నమ్మ 
సుభాష్‌: వద్దమ్మా నువ్వు వెళ్లి ఆ రాక్షసి దగ్గర దేహి అంటూ చేయి చాచడం నాకు ఇష్టం లేదమ్మా..? ఇప్పటి వరకు నీకోసం నేను ఏమీ చేయలేకపోయాను. భవిష్యత్తులో చేస్తానన్న నమ్మకం కూడా లేదు.. అలాంటి నాకోసం నువ్వు వెళ్లి ఆ రాక్షసిని అడగొద్దు అమ్మ మా వల్ల నువ్వు పడుతున్న కష్టాలు అవమానాలు చాలు ఆ అపరేషన్‌ చేయకపోతే ఏమవుతుంది. చచ్చే వరకు ఇలానే జీవచ్చంలా పడి ఉంటాను. దానికి నేను సిద్దమే కానీ నువ్వు మాత్రం వెళ్లి తనను అడగొద్దు అమ్మ.
 అంటూ ఎంత చెప్పినా ఇందు వినదు.. రేఖను డబ్బులు అడగడానికే రెడీ అవుతుంది. బయటకు వెళ్తుంది. నందు బోకే షాపు ఎదురుగా టీ కొట్టు దగ్గర ఒక దొంగ నిలబడి ఫోన్‌ మాట్లాడుతుంటే.. పోలీసులకు ఫోన్‌ చేసి పట్టిస్తుంది నందు. ఆ దొంగ నందుకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్తాడు. ఇక ఇంట్లో భ్రమరాంబ, రేఖ ఇద్దరూ ఐశ్వర్య నెక్లెస్‌ గురించి మాట్లాడుకుంటుంటే ఇందు వెళ్తుంది. 
ఇందు: ఆంటీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి 
రేఖ:  ఇప్పుడు కాదు తర్వాత
ఇందు: ఇది చాలా ముఖ్యమైన విషయం ఆంటీ తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలి.. డాక్టర్‌ పదిహేను లక్షలు అవుతుంది అంటున్నారు 
రేఖ: వదిన ఇది ఐశ్వర్య బర్తుడే కోసం డిజైన్‌ చేయించాను. ఎలా ఉంది
భ్రమరాంబ: అబ్బా చూస్తుంటేనే కళ్లు చెదిరిపోతున్నాయి అనుకో.. ఇక ఐశ్వర్య వేసుకుంది అంటే చూసే వాళ్ల కళ్లు పేలిపోతాయేమో 
ఐశ్వర్య వస్తుంది. ఇందును కోపంగా చూస్తుంది. 
రేఖ: హాయ్‌ ఐశ్వర్య ఏంటి ఇలా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు 
ఐశ్వర్య: మర్చిపోయావా.. నా ఎగ్జామ్ అయిపోగానే నా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తానని చెప్పాను కదా 
భ్రమరాంబ: అయితే పబ్‌కు వెళ్తున్నావు అన్నమాట 
ఇందు: ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి.. 
ఐశ్వర్య: ఏయ్‌ నీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను మాట్లడేటప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉండాలని.. అబ్బా.. నీ ఏడుపు గొంతు వింటుంటేనే నాకు చిరాకు వస్తుంది 
ఇందు: అది కాదు ఐశ్వర్య తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలి 
ఐశ్వర్య: చిన్నప్పటి నుంచి నీ దరిద్రం గురించి వింటూనే ఉన్నాను.. రోజుకో బాధ పూటకో రోగం ఇలాంటివి అన్ని చెప్పి నా మూడ్‌ పాడు చేయకు 
భ్రమరాంబ: బాగా చెప్పావు వినేవాళ్లు ఉంటే రోజుకో కథ చెప్తుంది ఇది 
ఐశ్వర్య: ఆంటీ నాకు పార్టీకి టైం అవుతుంది మనీ కావాలి 
రేఖ: ఎంత అని అడుగుతుంది 
ఐశ్వర్య: జస్ట్‌ వన్‌ లాక్‌ 
రేఖ ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది
ఐశ్వర్య వెళ్లిపోతుంది. ఇందు మాత్రం ఆపరేషన్‌కు డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. రేఖ లేవని వార్నింగ్‌ ఇస్తుంది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఆయన మంచి ఫుడ్‌ చేయాలి అని చెప్తుంది. మరుసటి రోజు ఇంటికి వచ్చి భోజనం చేసిన శివరాం. ఐటమ్స్‌ అన్ని బాగున్నాయని రోజూ ఒక పూట ఇందును వాళ్ల ఇంట్లో వంట చేయడానికి పంపమని అడుగుతాడు. రేఖ సరే అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 


టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget