అన్వేషించండి

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?

BRS Graduate MLC Candidates: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్, ఆర్థిక బలం ఉన్న నేతలనుఖరారు చేయనున్నారు.

Form 18 Telangana MLC Voter Registration:  తెలంగాణ రాజకీయాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గాల స్థానాలకు ఫారం-18 ద్వారా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈసారి ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా రూపొందిస్తుండటంతో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భుజాన వేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థుల ప్రకటన, ఓటర్ల నమోదులో ముందంజలో నిలవగా, విపక్ష బీఆర్ఎస్  , బిజెపి  మాత్రం తగు వ్యూహంతో తుది అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ముమ్మరం చేశాయి.

బలమైన నేతల కోసం కేసీఆర్ అన్వేషణ

ప్రధానంగా గులాబీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు ఈ గ్రాడ్యుయేట్ స్థానాలను దక్కించుకోవడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రుల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి ఈ ఎన్నికలను ఒక సువర్ణావకాశంగా కేసీఆర్ చూస్తున్నారు. ఇందులో భాగంగానే సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు స్థానిక  సోషల్ ఇంజనీరింగ్ సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. పట్టభద్రుల్లో వ్యక్తిగత ఇమేజ్, మంచి వక్తృత్వం ,  బలమైన అనుచరగణం ఉన్న నాయకులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.

క్యాడర్ నమ్మిన అభ్యర్థి అయితేనే గెలుపు

అధికారంలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పార్టీ కేడర్ పట్ల విధేయత మాత్రమే గెలుపును ఖాయం చేయలేదని బీఆర్ఎస్ అధిష్టానం గ్రహించింది. పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదు ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటం వల్ల, ప్రచారాన్ని గ్రామీణ స్థాయి వరకు వేగంగా తీసుకెళ్లగల  అంగ బలం, అర్థ బలం  ఉన్న నేతలకే ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. ఖర్చులు తట్టుకుని, సొంత బలంతో విస్తృత ప్రచారం చేసుకోగల ఆర్థిక పటిష్టత ఉన్న అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పటికే ముఖాముఖి సమావేశాలు పూర్తి చేశారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ సంక్షేమం, టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలను అస్త్రంగా చేసుకుని పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బిజెపి తన అర్బన్ ఓటు బ్యాంకుతో పాటు మోదీ ప్రభుత్వ ఇమేజ్‌తో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లను పంపించి టికెట్ల ఎంపికను కొలిక్కి తెచ్చే పనిలో పడింది. విపక్షాల అభ్యర్థుల ఖరారులో జరుగుతున్న కొంత జాప్యం ఓటర్ల నమోదుపై ప్రభావం చూపినప్పటికీ, అభ్యర్థి ఆర్థిక-సామాజిక బలాలు సరిగ్గా కుదిరితేనే కాంగ్రెస్‌ను నిలువరించడం సాధ్యమవుతుందని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.

రేపో మాపో అభ్యర్థుల ప్రకటన 

సోషల్ మీడియాలోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుపై గట్టి చర్చ నడుస్తోంది. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వివిధ డిజిటల్ వేదికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్లలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును లేదా పాత అనుభవాన్ని అనుకూలంగా మలుచుకోవాలంటే సమర్థుడైన అభ్యర్థి అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపాదనల్లో ఉన్న పేర్లను ప్రాసెస్ చేసి, సామాజిక వర్గ సమతుల్యతను పాటిస్తూ మరో నాలుగైదు రోజుల్లో బీఆర్ఎస్ తన అధికారిక అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ నాటికి తెలంగాణ రాజకీయాల్లో విద్యావంతుల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముందస్తు ప్రచార స్పీడ్‌కు చెక్ పెడుతూ, కేసీఆర్ ప్రకటించబోయే ఆ 'మాస్టర్ క్యాండిడేట్స్' పోటీని ఏ మలుపు తిప్పుతారో వేచి చూడాల్సిందే.
 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
Embed widget