అన్వేషించండి

YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?

YS Jagan BJP Support Delimitation Bill: బీజేపీ తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై వైఎస్ జగన్ స్టాండ్ ఏంటి? బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశానన్న రియలైజేషన్‌తో ఆయన మనసు మార్చుకుంటారా?

YSRCP Parliament Vote BJP Bills:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతివ్వడంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.  అలాగే కాక్రోచ్ జనతా పార్టీ   నిరసనకారులకు బహిరంగ మద్దతు తెలపడం జాతీయ రాజకీయాల్లో సరికొత్త రగడను రాజేసింది. గతంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చి తప్పు చేశానని, చట్ట సవరణల విషయంలో పరోక్షంగా పశ్చాత్తాపపడిన జగన్, ఇప్పుడు నిజంగానే ఆచరణాత్మక వ్యతిరేకతను ప్రదర్శిస్తారా అనే చర్చ తీవ్రమవుతోంది. ఈ నెల చివర్లో లేదా రాబోయే పార్లమెంట్  సమావేశాల్లో మోదీ ప్రభుత్వం అత్యంత కీలకమైన డీలిమిటేషన్,  మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురాబోతోందనే ప్రచారంతో జగన్ తీసుకోబోయే స్టాండ్ ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొలమానంగా మారనుంది.

రాజ్యాంగసవరణకు వైసీపీ సపోర్టు కూడా కీలకమే 

వైఎస్సార్‌సీపీకి ప్రస్తుతం లోక్‌సభ మ,  రాజ్యసభల్లో ఉన్న సభ్యుల సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, రాజ్యసభలో సంకీర్ణ సమీకరణాలు , విపక్షాల ఐక్యతను చాటడంలో ఆ కొద్దిమంది ఎంపీల ఓట్లు కూడా అత్యంత కీలకం కానున్నాయి. గత ఐదేళ్ల పాటు  నల్లచట్టాలు, కీలకమైన బిల్లులు,  డిప్యూటీ స్పీకర్ ఎన్నికల వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే, ఏపీలో 2024 ఎన్నికల ఓటమి తర్వాత, టీడీపీ-జనసేనలతో బీజేపీ జట్టుకట్టడంతో జగన్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు కేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశానా?  అనే ఆలోచనలో ఉన్న జగన్, రాబోయే డీలిమిటేషన్ చట్టసభల బిల్లు విషయంలో ధైర్యంగా వ్యతిరేక ఓటు వేయగలరా అన్నదే అసలైన ప్రశ్నగా మారింది.

మద్దతిస్తామని ఇప్పటికే సంకేతాలు - కానీ మారినరాజకీయం    

ఈ విమర్శలు, సవాళ్ల మధ్య వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ మాత్రం డీలిమిటేషన్ ,  మహిళా బిల్లులకు సూత్రప్రాయంగా మద్దతు ఇస్తామని ఇప్పటికే కొన్ని వేదికలపై సూచనలు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్,  నియోజకవర్గాల పునర్విభజనలు  దేశాభివృద్ధికి, దశాబ్దాల కల నెరవేర్చడానికి అవసరమైన ప్రాథమిక సంస్కరణలు  అనే వ్యాఖ్యలతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమర్థించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకమని చెప్తూనే, ఇటువంటి ప్రజామోదయోగ్యమైన బిల్లులను  రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం మద్దతిస్తున్నాం అని జగన్ ప్రకటిస్తే, అది మళ్లీ ఆయన్ను పాత  పరోక్ష మద్దతు  వైఖరిలోనే నిలబెడుతుంది. ఇక్కడే జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయతపై   ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఢిల్లీ వీధుల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రొటెస్ట్ గ్రూపులకు, ఈసీ వ్యతిరేక ఉద్యమాలకు ట్విట్టర్ వేదికగా బాహాట మద్దతు ఇవ్వడం, మరోవైపు పార్లమెంట్ భవనంలోకి వచ్చేసరికి అదే బీజేపీ తీసుకొచ్చే రాజ్యాంగ సవరణ బిల్లులకు అనుకూలంగా ఓటు వేయడం ద్విముఖ వైఖరిని ఎండగడుతోంది. గతంలో తప్పు చేశానని జనం ముందు చెప్పడం, తీరా నిర్ణయాత్మక ఘట్టం వచ్చేసరికి మళ్లీ అదే తప్పును పునరావృతం చేయడం జగన్ రాజకీయ అనిశ్చితికి నిదర్శనం  అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసే అవకాశం ఉంది. 

బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకునే ఈ వ్యాఖ్యలు? 

మరో కోణంలో చూస్తే, జగన్ ముందు రెండు స్పష్టమైన మార్గాలు మాత్రమే మిగిలాయి. మొదటిది.. తాము విధానపరంగా బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నామని నిరూపించుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి కీలక బిల్లును సూటిగా వ్యతిరేకించడం, తద్వారా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి లేదా ఇతర తటస్థ విపక్షాల సరసన నిలవడం. రెండోది.. జాతీయ అంశాలు వేరు, ప్రాంతీయ రాజకీయాలు వేరు అని చెప్తూ, భవిష్యత్తులో కేసుల ఒత్తిడి , కేంద్ర యంత్రాంగం నుంచి ఉపశమనం కోసం బిల్లులకు మద్దతు నిరంతరం కొనసాగించడం. కానీ, రెండో మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం  మళ్లీ తప్పు చేశానని భవిష్యత్తులో చింతించాల్సి వస్తుందనే విమర్శలను ఆయన తప్పించుకోలేరు. బిల్లులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక రాజకీయాలకు, సిద్ధాంతపరమైన స్టాండ్‌కు అసలైన అగ్నిపరీక్షగా మారనున్నాయి. మాటల్లో బీజేపీ వైఖరిని, ఎన్నికల వ్యవస్థను తప్పుబడుతున్న జగన్, చేతల్లో పార్లమెంట్ వేదికగా ఓటింగ్ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ నిర్ణయమే రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయి రాజకీయ భవిష్యత్తును, మిత్రులెవరో శత్రువులెవరో తేల్చే కీలక ఘట్టం కానుంది.
  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
YS Jagan Sharmila Dispute: కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget