పులివెందులలో ఇరువర్గాల మధ్య ఘర్షణలతో వాతావరణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఉద్రిక్తతను నియంత్రించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.