Guppedantha Manasu September 7 Update: రిషిధార రొమాంటిక్ డిన్నర్, కండిషన్స్ అప్లై అన్న ఈగో మాస్టర్
Guppedantha Manasu September 7 Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( బుధవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 7 Today Episode 549)
పరీక్షలు అయ్యేవరకూ ప్రేమను మనసులోనే దాచుకోవాలని కండిషన్ పెట్టిన రిషి..ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. వసుధారతో జీవితాంతం ప్రయాణం చేసేందుకు ఫిక్సయ్యాడు. అటు వసుధార కూడా తన మనసులో మాటని బయటపెట్టింది. ఈరోజు రాబోయే ఎపిసోడ్ లో రిషి-వసు ఇద్దరూ డిన్నర్ కి వెళ్లారు. వసుధార ... ఈ రోజు ఆకాశం, చందమామ, నక్షత్రాలతో ముచ్చట్లు పెట్టకు..నాతో మాట్లాడు అంటాడు. వసు నవ్వుతుంది. నీకు ఎప్పటి నుంచో ఓ మాట చెబుదాం అనుకుంటున్నా వసుధార...నువ్వు రోజురోజుకీ మరింత అందంగా కనిపిస్తున్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు.
రంగురంగుల రొమాంటిక్ ప్లేస్ లో .. వసుధార అందానికి రిషి ప్రశంసలు !! #StarMaaSerials #GuppedanthaManasu Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/aZRKarnHFk
— starmaa (@StarMaa) September 7, 2022
మరోవైపు జగతి-మహేంద్ర పెళ్లిరోజుని అవకాశంగా ఉపయోగించుకుని ఇంట్లో రచ్చ చేయాలని, రిషికి వసుని దూరం చేయాలని ప్లాన్ వేసింది దేవయాని. డైరెక్ట్‌గా వసుని కలిసి.. ‘నా గురించి నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు. కానీ రిషి అంటే నాకు ప్రాణం.. వాడ్ని నువ్వే ఓ విషయంలో ఒప్పించాలి. నీ సాయం కోసం వచ్చాను’ అంటుంది. జగతి-మహేంద్ర పెళ్లిరోజుని ఇంట్లో చేద్దామనుకుంటున్నానని..అందుకు రిషిని నువ్వే కన్విన్స్ చేయాలని కోరుతుంది...ఒప్పిస్తానని నాకు మాటివ్వు అంటూ వసుని ఇరికించే ప్రయత్నం లో ఉంటుంది దేవయాని. అదే సమయానికి రిషి అక్కడకు వెళతాడు. వసుతో మాట్లాడుతున్న దేవయానిని చూసి షాక్ అవుతాడు. పెద్దమ్మా మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు.
Also Read: మోనితను నడిరోడ్డుపై వదిలేసి దీప దగ్గరకు వెళ్లిపోయిన కార్తీక్, మోనితకు పెద్ద షాకే ఇది!
వసుధారతో వీడియో కాల్ మాట్లాడిన రిషి..‘వసుధార ఒకసారి ఇంటికి వచ్చేయ్.. కాదు కాదు.. ఎప్పటికీ మా ఇంట్లో ఉండేలా వచ్చేయ్. అలా పద్దతిగా మా ఇంటికి వచ్చేలా ఇంట్లో మాట్లాడతాను.. అలాగే మనం ఒకసారి మీ ఇంటికి వెళ్దాం వసుధారా.. నువ్వు చెప్పిన నీ జ్ఞాపకాలని నేను కళ్లారా చూడాలి. ఆ చింతచెట్టు.. చెరువు గట్టు అంతా చూడాలి సరేనా అంటాడు. సరే అంటుంది వసుధార.
Also Read: శౌర్య-వారణాసిని చూసిన మోనిత, డాక్టర్ బాబు ముందు నిజాయితీ నిరూపించుకున్న వంటలక్క
వసుధార తల్లిదండ్రులను సీరియల్ మొదట్లో చూపించారు. ఇప్పుడు రిషి పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళతా అంటున్నాడు కాబట్టి..త్వరలో వాళ్ల రీఎంట్రీ ఉండబోతోందన్నమాట. ఇప్పటివరకూ దేవయాని మాత్రమే సీరియల్ లో విలన్. అటు వసుధార తండ్రి కూడా వసుకి వ్యతిరేకం కాబట్టి...దేవయానికి మరో హ్యాండ్ తోడైనట్టే. ఇప్పటికైనా రిషికి దేవయాని నిజస్వరూపం తెలుస్తుందా... ఈ లెక్కన వసుకి కొత్త కష్టాలు మొదలవుతాయేమో చూడాలి...!