వాస్తు టిప్స్: ఇంట్లో వేసుకునే రంగులకి కూడా వాస్తు ఉంటుంది!వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రంగులు ప్రశాంతతని ఇస్తే, మరికొన్ని రంగులు గందరగోళంగా అనిపిస్తాయి. రంగుల ఎంపికలో ఎవరి అభిప్రాయం వాళ్లది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో వినియోగించాల్సిన రంగులు కొన్ని ఉన్నాయి.ఇంట్లో వేసే రంగుల విషయంలోనూ వాస్తు ఫాలో అయితే ఆరోగ్యం, కెరీర్ బావుంటుంది..ఇంట్లో ప్రశాంతత ఉంటుందని చెబుతారు వాస్తు పండితులు.ఇంటికి ఆగ్నేయ దిశ(అగ్నికి సంబంధించిన దిశ)లో నారింజ, గులాబీ, పసుపు రంగులు వేయడం శుభప్రదం. ఎందుకంటే ఇంటికి ఈ దిశ అగ్నికి సంబంధించినది.ఇంటి ఉత్తర భాగం నీటికి సంబంధించినది. ఆ దిశగా గోడలపై ఆకుపచ్చ, పిస్తా రంగులు వేయడం ద్వారా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు.ఉత్తరభాగానికి స్కై బ్లూ కలర్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ ఏదైనా ముదురు రంగును ఉపయోగించకపోవడమే మంచిదిపడమర వైపు గోడకు లేదా గదులకు నీలం రంగు సరైనదని చెబుతారు. ముదురు నీలం రంగుకు బదులుగా, కొద్దిగా తెలుపు మిక్స్ చేసి వేయడం మంచిదిపడకగదిలో గులాబీ రంగు, ఆకాశం రంగు లాంటి కలర్స్ వేయాలి. ఎందుకంటే ఇవి మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాదు చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ని పరుస్తాయట.ఇంట్లో అన్ని గదుల పైకప్పులకూ తెలుపు రంగే ఉండేలా చూసుకోవాలి. కారణం తెలుపు పాజిటివ్‌ ఎనర్జీకి సంకేతం. గదిలోని ఉష్ణోగ్రతనూ తగ్గిస్తుంది.దక్షిణం వైపు ఆరెంజ్ కలర్, గులాబీ రంగు వినియోగించవచ్చుఇంటి పైకప్పుపై తెలుపు రంగు వేయడమే ఉత్తమం అంటారు వాస్తుపండితులు. దేవుడిని పెట్టే గోడకు లేత పసుపు, తెలుపు, ఆకాశం, నారింజ లేదా లేత గులాబీ రంగులు వేయాలిNote: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

వాస్తు టిప్స్: వాల్ క్లాక్‌ని ఈవైపు అస్సలు పెట్టొద్దు!

View next story