News
News
X

Karthika Deepam September 7th Today Episode 1451: మోనితను నడిరోడ్డుపై వదిలేసి దీప దగ్గరకు వెళ్లిపోయిన కార్తీక్, మోనితకు పెద్ద షాకే ఇది!

Karthika Deepam September 7th Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 7th Episode 1451 (కార్తీకదీపం సెప్టెంబరు 7 ఎపిసోడ్)

కార్తీక్, మోనితని ఇంటికి తీసుకొచ్చాడు. మోనిత చాలా నీరసంగా ఉన్నావని బాధపడిపోతాడు కార్తీక్.ఎదురింటి ఆమె ఉందా అని మోనిత అడిగితే.. ఏం మళ్లీ ఇడ్లీలు తింటావా అని అడుగుతాడు. అంతపని చేస్తుంది అనుకోలేదు కార్తీక్ అని మోనిత అంటే.. అందుకే వార్నింగ్ ఇచ్చి పంపించేశానని చెబుతాడు కార్తీక్. తన కోసం కార్తీక్ దీపని పరాయి స్త్రీ లా చూసి వార్నింగ్ ఇచ్చాడా అని సంతోషపడుతుంది మోనిత.  
మోనిత: నువ్వు ఇంత తొందరగా కార్తీక్ ని వదిలేస్తావని అనుకోను.. ఏదో కొత్త ప్లాన్ తో వస్తావని నాకు తెలుసు. కానీ అప్పటికి మేము ముంబై చెక్కేస్తాము కదా అని ఆనందపడిపోతుంది. 

Also Read: శౌర్య-వారణాసిని చూసిన మోనిత, డాక్టర్ బాబు ముందు నిజాయితీ నిరూపించుకున్న వంటలక్క
హ్యాపీ బర్త్ డే శౌర్య అని హిమ..ఫొటో చూస్తూ బాధపడుతుంది. అప్పుడు సౌందర్య, ఆనందరావు అక్కడికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అప్పుడు హిమ, ఈరోజు నా పుట్టినరోజు కదా నా కోసం నాలుగు గంటలు సమయం కేటాయించండి. మనం శౌర్య దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఇద్దాం...అప్పుడైనా శౌర్య మనసు మారుతుందని అంటే..శౌర్య మారదమ్మా అని చెబుతుంది సౌందర్య. 
మరోవైపు  దీప...గుడికి వచ్చి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా అర్చన చేయిస్తుంది. మేము లేకుండా పిల్లలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారో లేదో... వాళ్లు ఆనందంగా గడపాలి, ఈ సమస్యలన్నీ తీరిపోయి మళ్లీ మేమంతా దగ్గరవ్వాలి అని దేవుడిని కోరుకుంటుంది. ఆ తర్వాత కార్లో వెళుతుండగా..మళ్లీ శౌర్య దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. సౌందర్య మాత్రం వద్దమ్మా అని చెబుతుంది.అటు శౌర్య కూడా వారణాసితో కలసి గుడికి వెళుతుంది.  అన్ని బాగుంటే వచ్చే సంవత్సరం ఇద్దరం కలిసి పుట్టిన రోజు చేసుకోండి అని అంటుంది. 

Also Read: తగ్గేదెలే అంటోన్న మోనిత, ముంబయికి డాక్టర్ బాబు- కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప

శౌర్య,వారణాసి తో కలిసి గుడికి వెళ్లి..ఈ రోజు నా పుట్టినరోజు వారణాసి అంటుంది. అదే సమయంలో దీప కూడా అదే గుడిలో ఉంటుంది. కార్తీక్,మోనిత ఇద్దరూ ఆ గుడికి వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కార్తీక్ అడగితే 
మోనిత: నువ్వు దీపతో మాట్లాడను అని నాకు దేవుడి మీద ఒట్టేసి చెప్పు కార్తీక్, నాకు నమ్మకం లేదు...నీకేమైనా అయితే నేను తట్టుకోలేను 
కార్తీక్: ఈ కాలంలో కూడా ఏం చేస్తున్నావు మోనిత? అసలే నాకు ఏ విషయం గుర్తుండదు.ఇప్పుడు ప్రమాణం చేసినట్టు కూడా మర్చిపోతాను 
మోనిత కార్తీక్ నీ బలవంతంగా లోపలికి తీసుకువెళ్లడం చూసి దీప అక్కడికి వస్తుంది. మీరు నాతో మాట్లాడకూడదు అన్నంత తప్పు నేను చేయలేదు డాక్టర్ బాబు. కావాలంటే నేను దేవుడి మీద ఒట్టేస్తాను అని దేవుడి మీద ప్రమాణం వేస్తుంది దీప.
మోనిత: ఇలా తప్పుచేసి ప్రమాణం చేయడం అలవాటే కదా అని అంటుంది.
దీప: నీకు నిన్న ఒంట్లో బాలేదు, హాస్పిటల్ కి నిజంగానే ఫుడ్ పాయిజన్ అయ్యి  వెళ్ళినట్టు నువ్వు ప్రమాణం చేయు అని అంటుంది  
అదే సమయంలో మోనిత..శౌర్యని చూస్తుంది. శౌర్య ఏంటి ఇక్కడుంది....దీప కి శౌర్య వచ్చినట్టు తెలుసా? మొన్న ఆంటీ, అంకుల్ వచ్చారు. ఇప్పుడు శౌర్య కనిపించింది, ఈ దీపా వెనకాలే ఉంటుంది. అన్ని దిక్కులు మూసుకుపోయాయి. వెంటనే ఈ ఊరు నుంచి చెక్కేయాలి అని అనుకుంటుంది.
కార్తీక్: ఏం చూస్తున్నావ్ మోనిత 
ఎపిసోడ్ ముగిసింది

Published at : 07 Sep 2022 08:54 AM (IST) Tags: Karthika Deepam Serial karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Nirupam Sobha Shetty premi archana doctor babu vantalakka monitha soundarya Karthika Deepam September 7th Today Episode 1451

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Guppedantha Manasu September 24th Update: రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Guppedantha Manasu September 24th Update:  రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల